కొత్త జిల్లాలతో వారికి పండగే పండగ | Telangana Finance Ministry approved new posts for new districts

Telangana finance ministry approved new posts for new districts

KCR new districts new jobs, telangana govt approval for new jobs, new jobs in new districts, new notification for new districts, 4 posts for new telangana, telangana 31 districts new jobs

Telangana Finance Ministry approved new posts for new districts.

కొత్త జిల్లాలతో ఇక వాళ్లకి జాతరే

Posted: 10/19/2016 04:42 PM IST
Telangana finance ministry approved new posts for new districts

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ద‌స‌రా నుంచి కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజ‌న్ల ఏర్పాటుతో ఏర్పడ్డ కొత్త పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోతుంది. ఈ మేరకు వాటికి సంబంధించిన వివరాలతో ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ‌లో మొత్తం 2109 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. క‌లెక్టరేట్లకు 693, రెవెన్యూ డివిజ‌న్లకు 188 పోస్టులు కేటాయిస్తూ అందులో పేర్కొంది. వాటిల్లో మండ‌ల స‌ర్వేయ‌ర్లు, ఆఫీస్ స‌బార్డినేట‌ర్లు, మండ‌ల ప్లానింగ్, స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్స్, త‌హ‌సీల్దార్‌, డిప్యూటీ త‌హ‌సీల్దార్‌, రెవెన్యూ ఇన్స్‌పెక్ట‌ర్లు, సీనియ‌ర్ అసిస్టెంట్లు, జూనియ‌ర్ అసిస్టెంట్ల పోస్టులు ఉన్నాయి.

ఇవేగాక మరో 2 వేల పోస్టులను కూడా భర్తీ చేయాలని టీ సర్కార్ భావిస్తోంది. పాఠశాల విద్యా శాఖ పరిధిలో 85 మండల విద్యాధికారి (ఎంఈవో) పోస్టులకు, ఆర్‌అండ్‌బీలో నాలుగు ఈఈ పోస్టులు, 4 సూపరింటెండెంట్, 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పోస్టులన్నీ టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. హోం శాఖలో మరో 1800 పోస్టులకు కూడా సీఎం కేసీఆర్ సూత్ర్రప్రాయంగా అంగీకారం తెలిపారంట.

శాఖల వారీగా భర్తీ చేసే పోస్టులు
రెవెన్యూ 2,109 (ప్రస్తుతం ఉత్తర్వులు ఇచ్చింది)
పోలీస్ 1,800
పాఠశాల విద్య 85
అగ్నిమాపక విభాగం 54
వ్యవసాయ శాఖ 25
ఆర్ అండ్ బీ 4
మొత్తం 4,077

ప్రస్తుతం రెవెన్యూ శాఖకు సంబంధించిన పోస్టుల జాబితా సిద్ధం చేయగా, అతి త్వరలోనే మిగతా వాటి కోసం కూడా రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telanagana  new districts  new jobs  notification  

Other Articles