భువనేశ్వర్ అగ్నిప్రమాదం: 22కు చేరిన మృతుల సంఖ్య 22 dead in devastating Bhubaneswar hospital fire

22 dead in devastating bhubaneswar hospital fire

Bhubaneswar hospital fire, fire in Bhubaneswar hospital, PM Narendra Modi, Bhubaneswar Hospital, SUM Hospital, accident short circuit, 19 people died, Sum Hospital Fire Mishap, Odisha news, Naveen Patnaik

In one of the worst fire-related incidents involving a medical facility in Odisha, at least 22 patients were killed and over 100 others injured after a major inferno raged through the Sum Hospital in Bhubaneswar.

భువనేశ్వర్ అగ్నిప్రమాదం: 22కు చేరిన మృతుల సంఖ్య

Posted: 10/18/2016 11:12 AM IST
22 dead in devastating bhubaneswar hospital fire

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుంది. సోమవారం అర్థరాత్రి విద్యుద్ఘాతంతో సంభవించిందని అనుమానిస్తున్న ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతూ పెరుగుతుంది. సుమారు 22 మంది సజీవ దహనం అయ్యారు. 100 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఒడిశా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సంఘటన విషయం తెలిసిన ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య కేవలం 19 మందేనని ఒడిశా అరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. నిన్న 22గా ప్రభుత్వం ప్రకటించిన వివరాలు తప్పని, అసలుకు అక్కడ మృత్యువాత పడింది మాత్రం 19 మందేనని అరోగ్యశాఖ ఇవాళ తెలిపింది. ఎంత మంది మరణించింది అన్న వివరాలు చెప్పడం బదులు.. మృతుల కుటుంభికులకు, క్షతగాత్రులకు అవసరమైన చికిత్సను అందించడంలో ప్రభుత్వ ముందుగా చర్యలు తీసుకోవడానికి బదులు మృతుల సంఖ్యలో తేడాలను చెప్పడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇక అసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలు తీసుకోవాలని, అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో పేషంట్లతో పాటు వారి అటెండర్లు, అస్పత్రి స్టాఫ్ సురక్షితంగా కిందకు దిగేందుకు మారో మార్గం ఏర్పాటు చేయాలన్న నిబంధనలు పాటించాయా లేదా..? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ సహా పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sum Hospital  electric short circuit  bhubaneshwar  naveen patnaik  pm modi  

Other Articles