రిగ్గింగ్ తో గెలుపోందేందుకు హిల్లరీ యత్నాలు: ట్రంప్ అనుమానం Donald Trump suspects Vote-Rigging

Donald trump is going on a furious twitter tirade about the rigged election

Donald Trump, us 2016 election, 2016 us polling, republican party, democratic party, hillary clinton, rigged election, bill clinton, hillary supporting media, america Us presidential elections

Donald Trump reinvigorated his pleas against the so-called rigged election in a barrage of tweets lambasting not only his political opponent Hillary Clinton and the media at large

రిగ్గింగ్ తో గెలుపోందేందుకు హిల్లరీ యత్నాలు: ట్రంప్ ఆరోపణలు

Posted: 10/18/2016 12:01 PM IST
Donald trump is going on a furious twitter tirade about the rigged election

అగ్రరాజ్యం అమెరికా పీఠం కోసం మరికోన్ని రోజుల వ్యవధిలో జరగుతున్న తుదిపోరు ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ సంచలన అరోపణలు చేశారు. నవంబర్ 8న జరగనున్న ఈ ఎన్నికలలో ప్రత్యర్థి పార్టీ రిగ్గింగ్ కు పాల్పడే అవకాశాలు వున్నాయిని అనుమానాలు వ్యక్తం చేశారు. తన ప్రత్యర్థి అభ్యర్థితో పాటు.. అమె భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియా కలసికట్టుగా ఎన్నికలలో రిగ్గింగ్ కు పాల్పడుతున్నాయిని అరోపించారు.

ఈ మేరకు అయన వరుస ట్విట్లు చేశారు. ఓటమి భయంతోనే డెమోక్రటిక్ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పారు. తన పార్టీకి చెందిన రిపబ్లికన్లు కూడా రిగ్గింగ్ ఎన్నికలపై పెదవి విప్పకపోవడాన్ని కూడా అయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా అయన ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రమేయం కూడా వుంటుందని అయన పరోక్షంగా అనుమానాన్ని వ్యక్తం చేశారు. వైట్ హౌజ్ ప్రమేయంతోనే రిగ్గింగ్ ఎన్నికలు జరుగుతాయని ట్రంప్ అరోపణలు చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే.. చివరిసారి అంటే 2012లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 57.5 శాతం ఓటింగ్ నమోదయింది. అదే 2008లో ఓటింగ్ శాతం 62.3గా ఉంది. మొదటిసారి ఒక నల్లజాతీయుడైన ఒబామా అధ్యక్ష రేసులో ఉన్నందున ఓటింగ్ శాతం అమాంతం పెరిగింది. బుష్ రెండోసారి అధ్యక్షుడిగా గెలిచిన ఎన్నికల్లో(2004లో) 60.4 శాతం, 2000 సంవత్సరంలో 54.2 శాతం ఓటింగ్ నమోదయింది. మునుపెన్నడూలేని విధంగా విత పోకడలున్న 2016 ఎన్నికల్లో ప్రజలు ఏమేరకు ఓటింగ్ లో పాల్గొంటారో మరో 20 రోజుల్లో తేలిపోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : donald trump  hillary clinton  us presidential elections  rigged elections  

Other Articles