అమరావతి గురించి కేసీఆర్ కి ఎందుకు ఆరాటం | KCR request Governor to Handover AP buildings

Kcr requested governor to handover ap buildings

KCR request Governor Narasimhan to Handover AP buildings, KCR new secretariat, Telangana New secretariat, KCR Narasimhan on New Secretariat

KCR request Governor Narasimhan to Handover AP buildings to build new secretariat.

కేసీఆర్ కి అదంత కష్టమైన పనేం కాదు

Posted: 10/18/2016 09:22 AM IST
Kcr requested governor to handover ap buildings

పదేళ్లు ఉమ్మడి రాజధాని ఒప్పందం ఉన్నా సరే... ఇక హైదరాబాద్ లో ఉండటం మంచిది కాదన్న భావనకు వచ్చిన చంద్రబాబు వీలైనంత త్వరగా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలివెళ్లేందుకు సన్నాహాలు చేశాడు. అంతేకాదు ఇప్పటికే వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ప్రారంభమై వారంలో ఐదు రోజులు అధికారులు, మంత్రులతో సందడి నెలకొంటోంది. దీంతో ఇక్కడ కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ఎప్పటి నుంచో కాచుకుని ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి లైన్ క్లియర్ అయినట్లు చెప్పుకోవచ్చు.

కార్యాలయాలు దాదాపుగా తరలిపోవటంతో ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉన్న భవనాల నుంచి ఆంధ్రావారిని ఖాళీ చేయించి తమకు అప్పగించేలా చూడాలని సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ కు విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజభవన్‌కు వెళ్లి గవర్నర్ ను కలిసి ఇదే అంశాన్ని చర్చించినట్టు అధికార వర్గాల సమాచారం. సెక్రటేరియేట్ ప్రస్తుతమున్న చోటే తిరిగి నిర్మించాలని భావిస్తున్నామని, నవంబర్ లో పునాది వేస్తామని ఆయన స్పష్టం చేస్తూ, విభజనతో ముడిపడ్డ సున్నితమైన అంశం కావడంతో తొలుత గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చినట్టు తెలుస్తోంది.

సచివాలయంలోని ఏపీ భవనాలను ఖాళీ చేస్తే, ప్రతిగా వేరే ప్రాంతంలో ఆఫీసు భవనాలు చూస్తామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారంట. సచివాలయం పక్కనే ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవనంలోకి కీలక శాఖలను, ఆపై ఎర్రమంజిల్, హిమాయత్ నగర్ ప్రాంతాల్లోని వివిధ విభాగాల కార్యాలయాలకు ఆయా శాఖలను తరలించాలని భావిస్తున్నట్టు కేసీఆర్ వివరించినట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దగ్గర రెండు ఫ్లాన్ లు ఉన్నాయి. వారు నిరభ్యరంతంగా అప్పగిస్తే ప్రముఖ ఆర్కిటెక్క్ హఫీజ్ కాంట్రాక్టర్ తయారు చేసిన డిజైన్‌తో 'యు' ఆకారంలో రూ.350 కోట్లతో కొత్త భవనం నిర్మించడం. అలా కాకుండా విభజన చట్టంలో పది సంవత్సరాల గడువు ప్రస్తావన లెవనెత్తితే మాత్రం తాత్కాలికంగా పది అంతస్తులతో రూ. 180 కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మించడం రెండవ ఆలోచన. ఈ రెండింటిలో ఏది జరిగినా... ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించిన ఎ నుంచి డి బ్లాక్‌ల వరకు ఉన్న భవనాలను డిసెంబర్‌లో కూల్చివేసి కొత్త భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ గవర్నర్‌కు వివరించినట్టు సారాంశం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  New Secretariat  KCR  Narasimhan  

Other Articles