ముగిసిన పాంపోర్ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం Pampore encounter ends after 57 hours, two militants killed declares Army

Pampore encounter ends after 57 hours two militants killed declares army

kashmir, pampore, fidayeen attack, srinagar attack, terrorist attack pampore, terrorist attack srinagar, terror attack kashmir, j&k, jammu and kashmir, pampore building attacked, pampore fidayeen attack, Lashkar-e-Taiba millitanats in pampore builtding killed

The encounter between security forces and militants holed up in the Entrepreneurship Development Institute building in Pampore ended, as the army called off the operation about 57 hours after the gunfight began.

ముగిసిన పాంపోర్ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

Posted: 10/13/2016 08:21 AM IST
Pampore encounter ends after 57 hours two militants killed declares army

లక్ష్యిత దాడుల అనంతరం భారత్ పై ప్రతీకారంతో రగలిపోతున్న పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తోయిదా ఉగ్రవాదులు అక్రమంగా భారత్ లోకి చోరబడి మన సైన్యంపై దాడులకు పాల్పడటంతో అందులో నక్కిన ఇద్దరు ఉద్రవాదులను హతమార్చారు. సుమారుగా 57 గంటల పాటు ఎడతెరపి లేకుండా జరిపిన ఎన్ కౌంటర్ లో ఉగ్రవాదులను రక్షణ బలగాలు మట్టుబెట్టాయి. పాకిస్థాన్ నుంచి ఓ నాటు పడవలో అక్రమంగా వచ్చిన లష్కరే ఉగ్రవాదులు సరాసరి పుల్వామా జిల్లాలోని పాంపోర్‌లోని ఓ ప్రభుత్వ భవనంలో నక్కారు.

జమ్మూకశ్మీర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్(జేకేఈడీఐ) కాంప్లెక్స్‌లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో భవనాన్ని చుట్టుముట్టిన సైన్యంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈడీఐ భవనంలో గాలింపు చర్యలు పూర్తయ్యాయని, ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమయ్యాయని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. సోమవారం ఉగ్రవాదులు ఈ భవనంలోకి చొరబడిన విషయం తెలిసిందే. ఆరోజు జరిగిన కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడు. అప్పటి నుంచి భద్రతా దళాలు చాకచక్యంగా వ్యవహరించాయి.

ఆ భవనంలో 60 గదులు ఉండటం వల్ల, ఒక్కో గదిని స్వాధీనం చేసుకోవాల్సి రావడం వల్ల ఎన్‌కౌంటర్‌కు ఎక్కువ సమయం పట్టిందని మేజర్ జనరల్ అశోక్ నౌరులా తెలిపారు. కాగా, ఉగ్రవాదులు ఈ భవనంలో చొరబడటం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. గతంలో ఫిబ్రవరి నెలలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు, ముగ్గురు ఉగ్రవాదులు, మరో పౌరుడు చనిపోయారు. కశ్మీరీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఇలాంటి భవంతిపై ఉగ్ర మూకలు తరచూ దాడి చేయడం బాధ కలిగిస్తోందని అశోక్ నౌరులా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  terrorists  indian army  fidayeen  srinagar  simhapuri area  jammu and kashmir  Lashkar-e-Taiba  

Other Articles