అడకత్తెరలో డోనాల్డ్ ట్రంప్.. సోంత పార్టీలోనూ వ్యతిరేకత Two Women Accuse Donald Trump Of Unwanted Physical Contact

Two women accuse donald trump of unwanted physical contact

donald trump, us presidential elections, trump gropped, women allegations, Trump Donald J, Presidential Election of 2016, Women and Girls, trump molestation, republicans, democratic candidate, Hillary clinton, allegations, crime

Donald J. Trump was emphatic in the second presidential debate: Yes, he had boasted about kissing women without permission and grabbing their genitals.

అడకత్తెరలో డోనాల్డ్ ట్రంప్.. సోంత పార్టీలోనూ వ్యతిరేకత

Posted: 10/13/2016 10:16 AM IST
Two women accuse donald trump of unwanted physical contact

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అడకత్తెరలో పోక్కచెక్క మాదిరిగా చిక్కుకున్నారు. ఇప్పటికే తన ముంగిట ఓటమి స్పష్టంగా కనబడుతున్నా.. ఇంకా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. ఏదో అద్బుతం తనను గెలిపిస్తుందని, తన వైట్ హౌజ్ అశలను సజీవం చేస్తుందని కలులు కంటున్న ట్రంప్.. రేసులో తన వెన్నంటే వుండి నడిపిస్తున్న సొంతపార్టీ రిపబ్లిక్లపైనే విరుచుకుపడుతున్నారు. తన ఓటమిని అంగీకరించకుండా అటు మీడియా తప్పుడు కథనాలు రాస్తుందంటూ అక్కస్సును వెల్లగక్కుతున్నారు.

తనకు వ్యతిరేకంగా అమెరికాలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే ఇరుకునపడిన ట్రంప్ తాజాగా మారో వివాదంలోనూ చిక్కకున్నారు. రెండో బిగ్ డిబేట్ లో మహిళలపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అడియో బయటపడటంతో ముప్పేట దాడిని ఎదుర్కోంటున్నట్రంప్ తనకు సంబంధించిన అ వీడియో ఏళ్ల క్రితమైనదని దాటవేసే ధోరణిని అవలంబించి.. ఎట్టకేలకు అంగీకరించి క్షమాపణలు చెప్పారు. తన ప్రత్యర్థి భర్త బిల్ క్లింటన్ మహిళలపై ఇంతకన్నా దారుణమైన వ్యాఖ్యలు చేశారంటూ అరోపించి.. కప్పదాటు ప్రయత్నాలు చేపట్టారు. ఇందుకు సంబంధించి ఓ ప్రేస్ మీట్ కూడా ఏర్పాటుచేసి మరీ బిల్ పై మండిపడ్డారు.

ఇదే క్రమంలో ట్రంప్ తమను గతంలో అసభ్యంగా తాకారని ముగ్గరు మహిళలు ఆరోపించారు. వారిలో ఒకరు తనను పెదవుల మీద బలవంతంగా ముద్దుపెట్టుకున్నారని చెప్పగా, మరొకరు చెప్పరాని చోట తాకారని అన్నారు. ఇంకొకరు తనను వెనక భాగంలో అసభ్యంగా నొక్కారన్నారు. ట్రంప్ అనుచరులు కూడా తాజాగా న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చిన కథనాన్ని తీవ్రంగా ఖండించి.. అది ఆయన వ్యక్తిత్వ హననమే అవుతుందన్నారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం తాను, ట్రంప్ పక్కపక్క సీట్లలో విమానంలో ప్రయాణించినట్లు జెస్సికా లీడ్స్ అనే వ్యాపారవేత్త చెప్పారు. అప్పుడు ట్రంప్ తనను అసభ్యంగా తాకారన్నారు.

విమానం టేకాఫ్ తీసుకున్న 45 నిమిషాల తర్వాత ట్రంప్ తమ రెండు సీట్ల మధ్య చెయ్యిపెట్టుకోడానికి ఉన్న ఆర్మ్ రెస్ట్‌ను తీసేసి.. తనను చాలా అసభ్యంగా తాకడం మొదలుపెట్టారని, తన స్కర్టు మీద కూడా చెయ్యి వేశారని ఆమె అన్నారు. అతడు ఆక్టోపస్‌ లాంటివాడని, అతడి చేతులు అన్నిచోట్లా ఉన్నాయని ఆరోపించారు. అప్పటికి తన వయసు 38 ఏళ్లన్నారు. దాంతో తాను వేరే సీటులోకి మారిపోయానని చెప్పారు. రాషెల్ క్రూక్స్ (22) అనే మరో మహిళ 2005లో ట్రంప్ టవర్‌లోని ఒక రియల్ ఎస్టేట్‌ కంపెనీలో రిసెప్షనిస్టుగా పనిచేసేవారు.

ఒకరోజు ఉదయం భవనం బయట ఉన్న లిఫ్టులో ట్రంప్ కలిశారని, తనను తాను ఆయనకు పరిచయం చేసుకుని షేక్‌హ్యాండ్ ఇవ్వగా, ట్రంప్ ముందు బుగ్గల మీద, తర్వాత పెదాల మీద బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని చెప్పారు. అది చాలా ఇబ్బందికరంగా అనిపించిందని, తాను ఏమీ చేయలేనని భావించి ఆయనలా చేసి ఉంటారని అన్నారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ తన కార్యాలయానికి వచ్చి ఫోన్ నెంబరు అడిగారన్నారు. ఎందుకు కావాలని అడగ్గా.. తన మోడలింగ్ ఏజెన్సీకి పంపుతానని చెప్పారన్నారు. మొత్తానికి బిల్ క్లింటన్ ను టార్గెట్ చేయబోయి.. తానే లైంగిక దాడుల అడకత్తెరలో చిక్కకున్నాడు ట్రంప్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  Presidential Election of 2016  Women and Girls  molestation  allegations  crime  

Other Articles