సైబరాబాద్ పోలీసుల అదుపులో వ్యభిచార ముఠా police raided prostitution house in chaitanynapuri

Police raided prostitution house in chaitanynapuri

brothel house, Three arrested, chaitanynapuri, cyberabad police, prostitute arrested in chaitanynapuri, raid on brothel house, brothel house organiser arrested, west bengal, , biswas, pintu, krishna kabir, rescue home

cyberabad police raid brothel house in chaitanyapuri, arrested west bengal organiser biswas along with prostitues and one onother

సైబరాబాద్ పోలీసుల అదుపులో వ్యభిచార ముఠా

Posted: 10/13/2016 07:37 AM IST
Police raided prostitution house in chaitanynapuri

నేరరహిత రాజధాని ఏర్పాటు దిశగా పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. హైదరాబాద్ లో నేర ప్రవృత్తి కలిగిన వారికి కొదవ మాత్రం లేకుండా పోతుంది. కొత్త కొత్త పద్దతుల ద్వారా నేరాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అయితే ఎన్ని పద్దతులు మార్చినా చివరకు పోలీసులకు చిక్కక తప్పదని వారు పట్టబడే వరకు వారికే తెలియదు. తాజాగా జనవాసాల మధ్య ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఎవరికీ అనుమానం రాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ బ్రోతల్ హౌస్‌ గుట్టురట్టయింది.  ఈ వ్యభిచార గృహంపై దాడి చేసిన చైతన్యపురి పోలీసులు వ్యభిచార గృహం నడిపిస్తున్న నిర్వాహకులను, యువతులను, విటుడిని అరెస్ట్ చేశారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన పి.బిశ్వాస్‌ హైదరాబాదు, చైతన్యపురిలోని ప్రభాత‌నగర్‌ కాలనీలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచార గృహంపై దాడిచేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిర్వాహకుడు బిశ్వాస్‌తో పాటు ఖైరతాబాద్‌కు చెందిన విటుడు కృష్ణ కబీర్, యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మహిళలను రెస్య్యూహోంకు తరలించారు. వ్యభిచార గృహం నిర్వహణలో ప్రధాన సూత్రధారులైన బాలానగర్ వాసి పింటు, రాజ్ మండల్ అలియాస్ రసూల్ పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : brothel housw  prostitution  chaitanynapuri  cyberabad police  crime  

Other Articles