ఈ పవన్ కళ్యాణ్ కు ఏమైంది? | mega aqua food park affected villagers meet pawan kalyan

Mega aqua food park affected villagers meet pawan kalyan

pawan kalyan mega aqua food park affected villagers, pawan kalyan worthless promise, pawan confusion speech, Janasena Pawankalyan, Janasena Head pawan kalyan

mega aqua food park affected villagers meet pawan kalyan.

మళ్లీ అయోమయంలో పవన్ కళ్యాణ్?

Posted: 10/12/2016 09:21 PM IST
Mega aqua food park affected villagers meet pawan kalyan

రాజకీయ కెరీర్ ప్రారంభంలో కాస్త స్పష్టత ఉన్న పవన్ మాటల్లో రాను రాను క్లారిటీ మిస్సవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మధ్య ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా కేవలం పోరాడతా అనే మాటలతో సరిపెట్టిన జనసేన అధినేత ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయాడు. మరో రెండేళ్లపాటు వరుస సినిమాలతోనే గడిపేయనున్నాడు. సరిగ్గా ఎన్నికలకు ఒక ఏడాది ముందు తిరిగి రంగంలోకి దిగుతాననే సంకేతాలు అందించాడు. కానీ, మెచ్యూరిటీ లేని మాటలు ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా పశ్చిమగోదావరి జిల్లా మెగా ఆక్వాఫుడ్ పార్క్ బాధిత గ్రామాల ప్రజలు పవన్ కళ్యాణ్ ను కలిశారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్ వల్ల 30 గ్రామాలు తీవ్ర కాలుష్యానికి గురవుతాయని బాధిత గ్రామాల ప్రజలు అతనికి వివరించారు. ఈ క్రమంలో వారికి భరోసా ఇచ్చిన పవన్ ఆ వెంటనే పారిశ్రామికాభివృద్ధికి జనసేన పెద్దపీట వేస్తుందంటూ అయోమయానికి గురిచేసే ఓ స్టేట్ మెంట్ ఇచ్చుకున్నాడు.

సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ప్రభుత్వ ఉన్నతాధికారులతో తాను మాట్లాడతానంటూ వారికి మరో మాట సాయం చేశాడు. చివర్లో అభివృద్ధి ఎంత ముఖ్యమో, ప్రజల బాధలు కూడా అంతే ముఖ్యమంటూ తెలిపాడు. మొత్తానికి తమ గోడును వెల్లబోసుకునేందుకు వచ్చిన బాధితులు పవన్ మకతిక మాటలతో గందరగోళానికి గురై అక్కడి నుంచి పెదవి విరుస్తూ నిష్క్రమించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena  Pawan Kalyan  mega aqua food park  villagers  

Other Articles