కాశ్మీర్ లో నక్కిన 250 మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 250 militants hiding in Kashmir Valley, waiting to strike

250 militants hiding in kashmir valley waiting to strike

Kashmir Valley, kashmir, Army, Uri, Surgical strikes, PoK, Lashkar-e-Taiba, 250militants, waiting to strike, Jaish-e-Mohammed terrorists, hizbul mujahideen terrorists, kashmir, pampore, fidayeen attack, srinagar attack, terrorist attack pampore, terrorist attack srinagar

At least 250 terrorists belonging to three Pakistan-based terror groups are active in the Kashmir valley and they could target security forces to 'avenge' the surgical strikes

కాశ్మీర్ లో నక్కిన 250 మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు

Posted: 10/11/2016 08:54 AM IST
250 militants hiding in kashmir valley waiting to strike

భారత్ లో పెను విధ్వంసం సృష్టించేందుకు దాదాపు 250మందికి పైగా ఉగ్రవాదులు కశ్మీర్ వ్యాలీలో నక్కి ఉన్నట్లు భారత్ ప్రభుత్వానికి సమాచారం అందింది. నిర్దేశిత దాడులకు ప్రతీకారంగా ఆర్మీపై దాడులు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్రవాదులు కశ్మీర్ లోకి అక్రమంగా చోరబడినట్లు సమాచారం. సర్జికల్ దాడుల నేపథ్యంలో ప్రతికారంతో రగలిపోతున్న పాకిస్తాన్ అర్మీ.. ఉగ్రవాదులను అక్రమంగా దేశంలోనికి పంపిందని, దీంతో పాకిస్థాన్ ఉగ్రవాదలు కాశ్మీర్ లో అల్లకల్లోలం సృష్టించి.. కాశ్మీర్ లో భారత ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తుందని కుట్రలు, కుయుక్తులు, కుతంత్రాలతో ఐక్యరాజ్య సమితిలో వాదించేందుకు రంగం సిద్ధం చేసుకుందని సమాచారం.

లష్కర్‌-ఈ-తోయిబా, జైష్‌-ఈ-మొహమ్మద్, హిజ్బుల్‌ మొజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాదులు సర్జికల్ స్ట్రైక్స్ కు ముందే కశ్మీర్ లోకి ప్రవేశించినట్లు ఇంటిలిజెన్స్ భారత ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అప్పటినుంచి కశ్మీర్ లోనే వీరందరూ తలదాచుకుంటున్నారని పేర్కొంది. వీరందరికీ భారత ఆర్మీపై ప్రతీకారం తీర్చుకోవాలనే సూచనలు అందాయని ఇంటిలిజెన్స్ తెలిపింది. దీంతో జమ్మూకశ్మీర్ లోని భద్రతా దళాలు అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం కోరింది. ఉగ్రవాదులు ఆర్మీపై దాడికి దిగితే తిప్పికొట్టాలని చెప్పింది.

అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖల వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించినా అక్కడక్కడా భద్రతను ఏర్పాటుచేయడం కష్టతరంగా మారింది. దీంతో ఆర్మీ, బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను కూడా చేపట్టారు. దాదాపు 100మందికి పైగా ఉగ్రవాదులు చొరబాటుకు ఎల్వోసీ ఆవల వేచి చూస్తున్నట్లు సమాచారం. గత నెల రోజుల్లో చొరబాటుకు ప్రయత్నించిన 40మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి. బారాముల్ల, పాంపోర్, హంద్వారా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చొరబాటుకు టెర్రరిస్టులు యత్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kashmir Valley  kashmir  Army  Uri  Surgical strikes  PoK  Lashkar-e-Taiba  

Other Articles