సామ్ సంగ్ గాలక్సీ నోట్ 7 ఫోన్ వుందా..? స్వీచ్ అప్ చేయండీ.. Samsung Tells Consumers to Stop Using Galaxy Note 7

Samsung tells consumers to stop using galaxy note 7

samsung, samsung galaxy note 7, galaxy note 7, galaxy note 7 recall, galaxy note 7 fire, galaxy note 7 explosion, galaxy note 7 catching fire, galaxy note 7 on fire, galaxy note 7 replacement phones, galaxy note 7 replacement, galaxy note 7 phones, galaxy note 7 stopped, galaxy note 7 exchange refund, mobiles, smartphones, technology, technology news

Samsung Company asks all telecom carriers and retailers selling Note 7 globally to stop sales and exchanges

సామ్ సంగ్ గాలక్సీ నోట్ 7 ఫోన్ వుందా..? స్వీచ్ అప్ చేయండీ..

Posted: 10/11/2016 10:10 AM IST
Samsung tells consumers to stop using galaxy note 7

తమ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను ఎవరూ వాడొద్దని, వాటిని ఎవరు వినియోగిస్తున్నా వెంటనే స్విచాఫ్ చేసేయాలని శాంసంగ్ కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. ''వినియోగదారులు ఒరిజినల్ గెలాక్సీ నోట్ 7 ఉన్నా, మార్చుకున్నది ఉన్నా కూడా దాన్ని వెంటనే స్విచాఫ్ చేసేయండి. ఆ ఫోన్ వాడకండి'' అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి ఇచ్చిన ఫోన్లు కూడా పేలుతున్నట్లు సమాచారం రావడంతో మరింత అప్రతిష్ఠ మూటగట్టుకోకుండా.. వెంటనే వాటన్నింటినీ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.

అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని టాప్ కంపెనీలు ఇప్పటికే నోట్ 7 ఫోన్ల అమ్మకాలను నిలిపివేశాయి. కొన్ని ప్రధాన విమానయాన సంస్థలు తమ విమానాల్లో ఈ ఫోన్లను అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నాయి. అమెరికాలోని ఒక ప్రయాణికుడు తాజాగా మార్చుకున్న ఫోన్ తీసుకెళ్తుండగా దాంట్లోంచి కూడా మంటలు రావడంతో విమానం నుంచి అందరినీ దింపేయాల్సి వచ్చింది. దాంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన శాంసంగ్ తలపట్టుకుంది. వెంటనే ఆ ఫోన్ల అమ్మకాలు ఆపేయాలని ప్రధాన మార్కెటింగ్ సంస్థలన్నింటినీ కోరింది.

అసలు సమస్య బ్యాటరీలో ఉందని భావించి, వెంటనే బ్యాటరీలు మార్చి ఇచ్చినా కూడా మళ్లీ అదే సమస్య తలెత్తుతోంది. దాంతో ఇప్పుడు మళ్లీ పరిశోధనలలో పడింది. గత రెండు నెలల్లో శాంసంగ్ తన ఫోన్ల అమ్మకాలు ఆపేయడం ఇది రెండోసారి. యాపిల్ ఐఫోన్‌కు దీటుగా ఉండేలా ఈ ఫోన్‌ను ఆగస్టు నెలలో శాంసంగ్ కంపెనీ మార్కెట్లలోకి విడుదల చేసింది. దానికి ప్రీబుకింగ్స్ భారీగా ఉండటంతో తొలుత సరఫరా చేయలేనంత పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లోకి రాగనే సమస్యలు చుట్టుముట్టాయి. బ్యాటరీ మార్చినా సమస్య వీడకపోవడంతో కంపెనీ యాజమాన్యం తమ ఫోన్లను వెంటనే స్విచ్ ఆప్ చేయాలని ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samsung  samsung galaxy note 7  switch off  exchange mobiles  technology news  

Other Articles