జయలలిత అరోగ్యంపై అభిమానుల్లో కలత CM responding well to the treatment, says Congress leader

Cm responding well to the treatment says congress leader

Jayalalithaa, health, tamilnadu chief minister, apollo hospital, jayalalithaa health, AIADMK, All India Anna Dravida Munnetra Kazhagam, Tamil Nadu, Chief Minister, C Vidyasagar Rao, Governor C Vidyasagar Rao, Hospital, Apollo Hospital

Former Congress MP, M. Krishnaswamy, visited Apollo Hospitals in Chennai where Tamil Nadu Chief Minister Jayalalithaa is undergoing treatment since September 22.

జయలలిత అరోగ్యంపై అభిమానుల్లో కలత

Posted: 10/11/2016 08:29 AM IST
Cm responding well to the treatment says congress leader

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో గత 21 రోజులుగా చెన్నూలోని అపోలో అస్పత్రిలో చికిత్స పోందుతున్న నేపథ్యంలో అమె అరోగ్యం విషయమై ఇంకా పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ వీడటం లేదు. అభిమానులకు ఇంకా సస్సెన్స్ వీడటం లేదు. అమెకు అవసరమైన చికిత్స కొనసాగిస్తున్నామని, అమెకు సీనియర్ న్యూట్రీషన్ అధ్వర్యంలోని డైట్ ను కూడా అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నా.. అభిమానులకు మాత్రం సస్పెన్స్ వీడటం లేదు. ఆమె ఆస్పత్రిలో చేరి ఇవాళ్టికి 21 రోజులు అయింది. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింతగా పెరుగుతుంది.

లండన్, ఎయిమ్స్ వైద్యుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి చికిత్స అందిస్తున్నామని అపోలో అస్పత్రి వైద్యులు చెబుతున్నారు. జయలలిత ఆరోగ్యంపై వదంతులు నమ్మవద్దని, త్వరలోనే ఆమె క్షేమంగా ఇంటికి చేరుకుంటారని వైద్యులు అంటున్నారు. ఆమెను పరామర్శించిన పలువురు ప్రముఖులు కూడా ఇదే మాట చెబుతున్నారు. అయితే అమెను పరామర్శించడానికి వచ్చిన ఏ ఒక్కరిని అమె వున్న వార్డుకు పంపించేందుకు వైద్యులు అనుమతించడం లేదు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా వార్డు అద్దం నుంచే అమెను చూసి వెనుదిరిగారని సమాచారం, కాగా అమెను ఇవాళ అపోలో అస్పత్రికి వెళ్లి పరామర్శించిన మాజీ కాంగ్రెస్ ఎంపీ కృష్ణస్వామి అమె వేగంగా కోలుకుంటున్నారని, వైద్యుల చికిత్సకు ఆమె సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్పారు

అయితే అభిమానులు మాత్రం ‘అమ్మ’ ఆరోగ్యంపై కలత చెందుతున్నారు. ఆమె కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు. మరోవైపు విపక్షాలు మాత్రం ఆరోపణలు గుప్పిస్తున్నాయి. జయలలిత ఆస్పత్రిలో చేరడంతో రాష్ట్రంలో పాలన స్తంభించిందని ఆరోపిస్తున్నారు. తాత్కాలిక సీఎంను నియమించి పాలనపై దృష్టిసారించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను ఏఐఏడీఎంకే నేతలు ఖండిస్తున్నారు. పరిపాలన సజావుగా సాగుతోందని, చౌకబారు ఆరోపణలు మానుకోవాలని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalithaa  tamilnadu chief minister  apollo hospital  jayalalithaa health  tamilnadu  

Other Articles