యూపీఏ హయాంలోనూ అపరేషన్ జింజర్ పేరిట సర్జికల్ స్ట్రైక్స్ Operation Ginger: Tit-for-tat surgical strikes across the Line of Control

Operation ginger tit for tat surgical strikes across the line of control

India, indian army, Operation Ginger, Pakistan, Surgical Strikes, Line of Control, Pakistani Rangers, Terrorist attack, pakistan army, pakistan occupied kashmir, Congress, BJP

Pakistani Rangers had struck a remote army post in Gugaldhar ridge in Kupwara district on the afternoon of July 30, 2011. Two of our soldier's heads were taken back as trophies!

యూపీఏ హయాంలోనూ అపరేషన్ జింజర్ పేరిట సర్జికల్ స్ట్రైక్స్

Posted: 10/10/2016 02:36 PM IST
Operation ginger tit for tat surgical strikes across the line of control

సర్జికల్ దాడులు.. టెక్నికల్ గా ఈ పేరు మనకు కొత్త. అయితే ఇప్పుడు భారత్ దేశంతో పాటు పాకిస్తాన్ సహా పలు దేశాలు, ఐక్యరాజ్యసమితిలో కూడా ఈ అంశమే ప్రధానంశమైంది. ఇక ఈ దాడులపై దేశంలో ఎక్కడ నలుగురు కలసినా వీటిపైనే చర్చ. ఆర్మీలో వున్నవారికి మాత్రం ఈ దాడుల గురించి తెలుసు. ఏ సందర్భంలో ఎలా ఈ దాడులకు పాల్పడాలో.. ఆర్మీకి తెలుసు. ఇటీవల పాక్ అక్రమిత కాశ్మీర్ లోకి చోచ్చుకెళ్లిన భారత సైన్యం అక్కడున్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించి 40 మందిని మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

అసలు దాడులు జరిగాయా..? అని ఐక్యరాజ్యసమితి సందేహాలను వ్యక్తం చేయడంతో.. ఆధారాలను చూపించాలని దేశంలోని ప్రతిపక్షాలు కూడా తమ వాదనను తెరపైకి తీసుకోచ్చాయి. అది చాలదన్నట్లు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మారో అడుగు ముందుకేసీ తమ హయాంలోనూ సర్జికల్ దాడులు జరిగాయని అన్నారు. అయితే ఈ దాడులను తాము దేశ రక్షణ శాఖల అంశంగా పరిగణించామే తప్ప, రాజకీయ లబ్దని అలోచించి ప్రజల్లోకి తీసుకువెళ్లలేదని కూడా తెలిపారు. అయితే అవి సర్జికల్ దాడులు కావని, వాటికి తాజాగా జరిగిన దాడులకు చాల వత్యాసముందని అర్మీ మాజీ డిజీఎంవో తెలిపారు.

అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హయాంలో 2011లోనే సర్జికల్ దాడులు జరిగాయని అంటున్నాయి తాజా నిజాలు. ఈ దాడుల్లో పాక్‌కు భారత్ ధీటుగా బదులిచ్చిందంటూ  ‘ది హిందూ’ ఆంగ్ల దినపత్రిక ఆదివారం తన కథనంలో పేర్కొంది. భారత ఆర్మీ సర్జికల్ దాడులు నిర్వహించిందని, ఇందులో 8 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారంటూ అధికారిక ఆధారాలు, వీడియో, ఫొటోల్ని సైతం బహిర్గతం చేసింది. అత్యంత హింసాత్మకంగా భారత్, పాక్‌ల మధ్య పరస్పర దాడులు జరిగాయని... ఇరువైపులా మొత్తం 13 మరణించారంటూ వెల్లడించింది.

ఆ పత్రిక కథనం ప్రకారం... ‘జూలై 30, 2011న కుప్వారా జిల్లా గుగల్దార్ పోస్టుపై పాక్ సైనికులు విరుచుకుపడ్డారు. ఐదుగురు భారతీయ సైనికులను దారుణంగా హత్యచేసి వారి తలలు నరికివేశారు. తమ వెంట హవిల్దార్ దేవేందర్ సింగ్, జైపాల్ సింగ్‌ల తలలు తీసుకెళ్లారు. మరో సైనికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో భారత్ ఆగస్టు 30, 2011న ‘ఆపరేషన్ జింజర్’ పేరిట సర్జికల్ దాడులతో పాక్ భూభాగంపై విరుచుపడింది. 8 మంది పాక్ సైనికుల్ని చంపి, ముగ్గురి తలల్ని భారత సైనికులు వెంట తీసుకొచ్చారు’ అంటూ పేర్కొంది. కుప్వారాలోని 28వ విభాగం ముఖ్య నిర్వహణ అధికారి ఈ సర్జికల్ దాడికి ప్రణాళిక రచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  indian army  Operation Ginger  Pakistan  Surgical Strikes  Line of Control  

Other Articles