పార్లమెంటుపై దాడికి ఐఎస్ఐ యోచన.. హెచ్చరించిన ఐబీ JeM militants may target Indian Parliament again

As revenge against surgical strikes jem may target indian parliament says report

Jaish-e-Muhammed (JeM), India, indian army, Indian parliament, Pakistan, ISI, JeM, plans spectacular attack, Indian intelligence agencies, JeM chief Maulana Masood Azhar, Jammu and Kashmir CID

The intelligence agencies have reportedly been tipped off about Pakistan-based terror outfit Jaish-e-Muhammed (JeM) planning an attack on the Indian Parliament.

పార్లమెంటుపై దాడికి ఐఎస్ఐ యోచన.. హెచ్చరించిన ఐబీ

Posted: 10/10/2016 02:40 PM IST
As revenge against surgical strikes jem may target indian parliament says report

అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రధానమంత్రిగా వున్న హయంలో జరిపిన దాడులనే పునరావృతం చేసేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుయుక్తులు, కుట్రలు పన్నుతుందా..? అంటే భారత ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి అవుననే హెచ్చరికలే సమాధానాలుగా వినబడుతున్నాయి. లక్ష్యిత దాడులతో చావుదెబ్బ తిని ఇంటాబయట అవమానాలతో రగిలిపోతున్న పాకిస్తాన్ నిఘా సంస్ధ.. భారత పార్లమెంటుపై దాడికి పాల్పడే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఉగ్రసంస్ధ జైష్ ఏ మొహమ్మద్ (జేఈఎమ్) సాయం కోరినట్లు తెలిసింది.

దీంతో పార్లమెంటుపై మళ్లీ దాడిచేసేందుకు జేఈఎమ్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ వ్యూహం రచిస్తున్నట్లు భారతీయ ఇంటెలిజెన్స్ సంస్ధలు హెచ్చరించాయి. ఎలాగైనా పార్లమెంటుపై దాడిచేయాలని అజర్ నుంచి ఆపరేటివ్స్ కు ఇప్పటికే సూచనలు అందినట్లు తెలిసింది. మావవబాంబు ప్రయత్నం పార్లమెంటుపై ఫలించకపోతే, ఢిల్లీ సెక్రటరియేట్, అక్షరధామ్, లోటస్ టెంపుల్ లపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం.

ఇక జనసాంధ్రత అధికంగా వుండే ప్రాంతాలో మానవ బాంబును ప్రయత్నించాలనే సూచనలు కూడా జేఈఎమ్ ఆపరేటివ్స్ కు ఉన్నాయి. ఈ మేరకు భారత ఇంటెలిజెన్స్ వివిధ శాఖల అధికారులను హెచ్చరించింది. కాగా, ఇప్పటికే ఇద్దరు జేఈఎమ్ టెర్రరిస్టులు ఫిదాయీ (మానవబాంబు) కావడానికి ఆపిల్ పండ్ల ట్రక్కు ద్వారా మారణాయుధాలతో ఢిల్లీలోని ఓ మార్కెట్ కు వచ్చినట్లు ఇంతకుముందు ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వచ్చాయి. అయితే భారత భద్రతా దళాలు మాత్రం అన్ని ప్రాంతాల్లో ముమ్మర గస్తీని ఏర్పాటు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  indian army  Indian parliament  Pakistan  ISI  JeM  plans spectacular attack  intelligence agencies  

Other Articles