ప్రపంచ రికార్డును సోంతం చేసుకున్న రిలయన్స్ జియో.. Reliance Jio creates world record

Reliance jio adds 16 million subscribers in first month

reliance, reliance jio, jio 4g, jio total subscribers, jio total users, jio world record, reliance jio network, iphone 7, reliance jio sim, reliance jio preview offer, jio welcome offer, jio aadhaar card, jio plan, jio 4g plan, technology, technology news

Reliance Jio has announced today that the the network has created a world record by crossing 16 million in total subscribers in 26 days

ప్రపంచ రికార్డును సోంతం చేసుకున్న రిలయన్స్ జియో..

Posted: 10/09/2016 04:43 PM IST
Reliance jio adds 16 million subscribers in first month

భారతీయ టెలీకమ్యూనికేషన్స్ రంగంలో రిలయన్స్ జియో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. అన్ని 4జీ మొబైల్ ఫోన్స్ కు మూడు నెలల పాటు ఫ్రీ ఇంటర్నెట్, ఫ్రీ వాయిస్ కాల్స్ ఇస్తామని ప్రకటించడంతో జియోకు దేశీయ కస్టమర్ల నుంచి అంచనాలకు మించి వినియోగదారులను సొంతం చేసుకుంది. జియో సిమ్ అమ్మకాలను ప్రారంభించిన కేవలం 26 రోజుల వ్యవధిలోనే 16 మిలియన్ల మంది కస్టమర్లను సంపాదించడంతో ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచంలో మరే ఇతర సిమ్ నెట్ వర్క్ కూడా ప్రవేశపెట్టిన నెలరోజుల్లో ఈ తరహాలో కస్టమర్లను నమోదు చేసుకోలేదు.

తద్వారా అత్యంత వేగవంతంగా ఎక్కువమంది వినియోగదారులను చేర్చుకున్న సంస్థగా అవతరించినట్టు రిలయన్స్ పేర్కొంది. సెప్టెంబరులో 4జీ మార్కెట్లోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో సంచలన ఆఫర్లతో ఇతర నెట్‌వర్క్ సంస్థల గుండెల్లో గుబులు పుట్టించిన సంగతి తెలిసిందే. కాగా సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, స్కైప్ వినియోగదారుల కన్నా కూడా ఈ సంఖ్య ఎక్కువని సంస్థ తెలిపింది. వినియోగదారుల నుంచి జియోకు లభించిన అపూర్వ ఆదరణతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు రిలయన్స్ సంస్థల చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reliance Jio  world record  16 million subscribers  technology news  

Other Articles