జనసేన దసరా కానుక.. అభిమానులు పుల్ ఖుషీ janasena enters social media with party teaseి

Janasena dussera gift to party workers and cadre

Jana Sena, Jana Sena Official Channel, Pawan kalyan, Pawan Kalyan Speech, Jana Sena Mana Sena Promo, Jana Sena Mana Sena teaser, Jana Sena Mana Sena, Janasena social media, Pawan Kalyan janasena, janasena youtube, janasena facebook, janasena teaser

Actor turned politician powerstar pawan kalyan made his party janasena's entry into social media with 'jana sena mana sena' teaser

ITEMVIDEOS: జనసేన దసరా కానుక.. కార్యకర్తలు పుల్ ఖుషీ

Posted: 10/06/2016 07:07 AM IST
Janasena dussera gift to party workers and cadre

మరో రెండేళ్లలో పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా జనసేన అవిర్భవిస్తుందని అప్పటి వరకు దశలవారీగా తన పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజల్లోకి తీసుకువెళ్తానని గత నెలలో తిరుపతి సభలో చెప్పిన పవన్ కల్యాన్ అన్నట్లుగానే ప్రజలకు చేరువగా వుండేందుకు కార్యచరణ సిద్దం చేసే పనిలో పడ్డాడు. కాకినాడ సభలో జనసేన కార్యకర్త సభాస్థలి అవరణలో పైనుండి పడి మృతి చెందడంతో ఇక తాత్కలికంగా సభల జోలికి వెళ్లలని చెప్పిన పవన్ ప్రజల్లోకి వెళ్లేందుకు మాత్రం మరో మార్గాన్ని అన్వేషించాడు. అదే సామాజిక మాధ్యమం. అవునండీ సోషల్ మీడియాతో పవన్ జనసేన ప్రజలతో పాటు అభిమానులకు కూడా చేరువకానుంది.

గత సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలుగు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన పార్టీని అవిర్భావం చేసినా.. తాను ఎన్నికలలో పోటీ చేయడం కోసం పార్టీని స్థాపించలేదని, ఓట్ల, సీట్లు తన అభిమతం కాదని చెప్పిన పవన్ కల్యాన్ అన్నట్లుగానే తాను నైతిక విలువలున్న పార్టీలుగా భావించిన బీజేపితో పాటు టీడీపీకి గత ఎన్నికలలో మద్దతు ప్రకటించారు. జనసేన మద్దతుతో ఓటమి అంచులలో వున్న తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయి విజయాన్ని అస్వాదించింది. ఇది జగమెరిగిన సత్యం. అయితే మరో రెండేళ్లలో పూర్తి స్థాయి రాజకీయ పార్టీ జనసేనను తీర్చిదిద్దడానికి పవన్ ఎందుకు కసరత్తు చేస్తున్నారు..? అనేగా మీ సందేహం.

గత ఎన్నికలలో తాను మద్దుతిచ్చిన పార్టీలు, ఆయా పార్టీల నేతలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడంతో ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన విషయంలో కేంద్రం చెబుతున్న అక్షేపణలు, రాష్ట్ర ప్రభుత్వ నిమ్మకు నీరెత్తిన వైఖరి అవలంభిస్తుందని.. దీంతో రాష్ట్ర సర్కారుతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సీమాంధ్ర ప్రజల అభిలాషను తెలియపర్చడంతో పాటు రాష్ట్రల తరపున నిరసన సెగను కూడా వాటికి తెలియజేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో తిరుపతి సభతో పాటు కాకినాడలో సభను నిర్వహించగా ప్రజల నుంచి ఉవ్వెత్తున స్పందన వచ్చింది.

అయితే అక్కడ జరగకూడని అపశృతి కూడా చోటుచేసుకుంది. ఒక అభిమాని మరణం అధినేత పవన్ కల్యాన్ ను కలచివేసింది. దీంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ప్రాణాలను పణ్ణంగా పెట్టడం ఇష్టంలేక తాత్కాలిక విరామాన్ని ప్రకటించి.. ప్రజలకు చేరువగా వుండేందుకు సోషల్ నెట్ వర్క్ లోకి అరంగ్రేటం చేశారు. ఫేస్ బుక్, ట్వట్టర్, యూ ట్యూబ్ ద్వారా అభిమానులతో నిత్యం టచ్ లో వుండేందుకు అధికారికంగా అకౌంట్లు తెరించి ముందడుగు వేశారు. అరంగ్రేటంతో పాటు త్వరలో విడుదల కానున్న పార్టీ వీడియోకు సంబంధించిన వీడియో టీజన్ (ప్రోమో)ను కూడా విడుదల చేసింది.

ఇవన్నీ ఈ రోజు నుంచి యాక్టివ్ గా ఉంటాయని.. పార్టీకి సంబంధించిన విశేషాలన్నింటినీ ఇందులో పంచుకుంటామని జనసేన నాయకులు ప్రకటించారు. పార్టీ విధానాలు.. సిద్ధాంతాలు.. వివిధ అంశాలపై పవన్ అభిప్రాయాలు.. పవన్ రాజకీయా కార్యకలాపాలపై అప్ డేట్స్.. ఇతర విశేషాల్ని ఇందులో సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడిస్తామన్నారు. అభిమానులు.. కార్యకర్తలు వీటిని అనుసరించాలని కోరారు. జనసేన.. మనసేన అనే నినాదంతో ఓ లోగో తయారు చేసి.. ఈ పేజీల ముఖచిత్రాల్ని అలంకరించారు నిర్వాహాకులు.

జనసేన సామాజిక మాద్యమాల్లో తమకు అందుబాటులో వుండాలన్న నిర్ణయం తీసుకోవడం అందకు అనుగూణంగా అధికార అకౌంట్లను కూడా తెరవడంపై అభిమానులు ఫుల్ ఖుషీలో వున్నారు. పార్టీ ప్రోమోను చూసి ఉబ్బితబ్బివవుతున్నారు. తమ అధినేత సభలకు తాత్కాలిక విరమణ ప్రకటించడంతో తాను ప్రకటించిన ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారన్న అభిమానుల ప్రశ్నలకు సమాధానం లభించింది. సోషల్ మీడియా వేదికగా ఆయన తన ఉద్యమాన్ని కొనసాగిస్తారని అభిమానులు, కార్యకర్తలు భావిస్తున్నారు, ఈ క్రమంలో పార్టీ టీజర్ కూడా సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. దీంతో పవన్ అభిమానులకు, జనసేన కార్యకర్తలకు ఆయన దసరా కానుకు అందించినట్లు అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  social media  jana sena  janasena manasena teaser  trending video  

Other Articles