ఆ చిన్నారులది ఎల్లలు లేని స్నేహం | heart touching Indian Pak kid friendship post

Heart touching indian pak kid friendship post

Heart touching Indian Pak kid friendship post, Pak kid Facebook post, heart touching Indian Pak kid friendship, Indian Pak kid Friendship, Pak Indian kid Friendship, Heart touching India Pak kid Friendship post

Heart touching Indian Pak kid friendship post viral.

ఆ పాక్ చిన్నారి పోస్టును ఒక్కసారి చూడండి

Posted: 10/05/2016 05:19 PM IST
Heart touching indian pak kid friendship post

ఓవైపు సరిహద్దులో యుద్ధం ఏ క్షణమైనా జరగొచ్చనే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు వార్ జరిగితే ఎవరిది గెలుపు అనే విషయంపై టీవీ ఛానెళ్లలో ఓ తీవ్రమైన డిస్కషన్లు జరుగుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణం వేడేక్కిస్తూ రాజకీయ నేతలు పండగ చేస్కుంటారు. ఆఖరికి సినిమా వాళ్ల లొల్లితో కూడా పరిస్థితులు పీక్స్ లోకి వెళ్లిపోయాయి. మరి ఇంత జరగుతున్నా ఏ ఒక్కరు కూడా శాంతి సందేశం ఇచ్చేందుకు ప్రయత్నించరా?

ఆ విషయానికే వస్తున్నాం. ఇక్కడ ఓ చిన్నారి పోస్టు చూస్తే ఎవరికైనా కాస్త ఆలోచన కలుగుతుంది. గుండె లోతుల్లోకి వెళ్లి ఆత్మ విమర్శ చేసుకుని పగ, ప్రతీకారాలు పక్కన పెట్టాలన్న భావన కలుగుతుంది. పాకిస్థాన్ కు చెందిన చిన్నారి తన మనోగతం వ్యక్తం చేసినట్లు ఉన్న ఈ పోస్టును పూర్తిగా పరిశీలిస్తే.. ఇద్దరు చిన్నారులు. సరిహద్దులను మరిచి తమ దేశాల మధ్య ప్రవహిస్తున్న నదీ తీరంలో రోజు సాయంత్రం కలుసుకునే వారు. ‘రోజు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే నా మిత్రుడు నదిలో అవతల నుంచి రాళ్లు వేసేవాడు. నేను ఇవతలి వైపు నుంచి అదే పని చేసేవాడిని.’

‘మరి వారి పేర్లు ఒకరికొకరు తెలుసా అంటే లేదు... నదీ మమల్ని దూరంగా ఉంచింది... మా మధ్య మాటలు లేవు... అతనెవరో నాకు సంబంధం లేదు. పేరు నాకు అక్కర్లేదు. అతను నా స్నేహితుడు... మా స్నేహాం మాత్రం ఇలాగే కొనసాగుతూనే ఉంది’ అంటూ అందులో ఉంది.

ఈ ఉల్లంఘనలు, దాడులు, కవ్వింపు చర్యల గురించి ఏ మాత్రం అవగాహాన లేని పసి హృదయాలు అవి. ఆడుకోవటం, స్నేహ హస్తం తప్పించి మరోకటి తెలీదు. మరి ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటి? సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వీరు కలుసుకుంటున్నారా? వైషమ్యాలు వీరి చిన్నారి హృదయాలను కలుషితం చేయొద్దనే కోరుకుందాం. ఏడాది క్రితం పెట్టిన ఈ పోస్టు ఇప్పుడు మళ్లీ అందరి పేజీల్లో కదలాడుతోంది. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోకుడదనేది మా అభిమతం కాదు... పొరుగున ఉన్న వారు మన సోదరులే అన్న భావన ఇరు ప్రాంతాల ప్రభుత్వాలు, నేతలు గుర్తించిన నాడు ఇలాంటి స్నేహలతో శాంతి విరజిల్లుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  India  Friendship  Kid  Facebook Post  

Other Articles