టెలీకమ్యానికేషన్ రంగంలో భారత్ మరో ముందడుగు GSAT-18 Launched Successfully After 24-hour Delay

Gsat 18 launched successfully after 24 hour delay

isro, india satellite launch, gsat-18, ariane-5, isro satellite launch, french guiana, indian space research organisation, satellite launch, communication satellite, gsat, gsat-18 payload, kourou, tech news, science news

GSAT-18 is the 20th satellite from ISRO to be launched by the European space agency and the mission is the 280th for Arianespace launcher family.

ITEMVIDEOS: టెలీకమ్యానికేషన్ రంగంలో భారత్ మరో ముందడుగు

Posted: 10/06/2016 07:55 AM IST
Gsat 18 launched successfully after 24 hour delay

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ మరో అడుగు ముందుకేసింది. ప్రతిష్టాత్మకమైన జీశఆట్ -18 ఉపగ్రహ ప్రయోగాన్ని ఇవాళ వేకువ జామున విజయవంతంగా నింగిలోకి పంపింది. ఫ్రెంచీ గయానాలో కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ 5 వీఏ 231 రాకెట్ ద్వారా జీశాట్ 18 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. భారత కాలమానం ప్రకారం ఇవాల వేకువజామున 2 గంటలకు అధునాతన కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌-18 ను ప్రయోగించారు. దీంతో భారత టెలీ కమ్యూనికేషన్స్ రంగం మరింత బలపడనుంది.

ఆస్ట్రేలియాకు చెందిన స్కై మస్టర్‌-2 ఉపగ్రహంతో కలిసి జీశాట్‌ ను నింగిలోకి పంపారు. వీటిని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో 24 గంటల ఆలస్యంగా జీశాట్-18 ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. దేశీయ టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థలో భారత్‌ కు చెందిన 14 సమాచార ఉపగ్రహాలు సేవలందిస్తుండగా, తాజాగా జీశాట్ 18 ఉపగ్రహ ప్రయోగంతో మరింత మెరుగైన సేవలు పొందే అవకాశం ఉంది. దేశంలో డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని జీశాట్-18 అందుబాటులోకి తెస్తుంది.

ఈ ఉపగ్రహంలో 24 సీ బాండ్ ట్రాన్స్‌ఫాండర్స్, 12 ఎక్సెంటెడ్ సీ బాండ్, 12 కేయూ బాండ్ ట్రాన్స్‌ఫాండర్స్, 2 కేయూ బీకాన్ బాండ్ ట్రాన్స్ ఫాండర్స్‌ను పంపించారు. ఈ ఉపగ్రహం 15 ఏళ్ల పాటు సేవలందిస్తుంది. ప్రయోగం నిమిత్తం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్, శాటిలైట్ డెరైక్టర్ సూర్యప్రకాశ్‌రావు ఫ్రాన్స్‌లోనే ఉన్నారు. ప్రయోగం పూర్తి అవ్వడంతో బెంగళూరులోని హాసన్ మాస్టర్ కంట్రోల్ సెంటర్ ఉపగ్రహాన్ని అదుపులోకి తీసుకుని నియంత్రిస్తుంది. దీంతో జీశాట్-18 ద్వారా అందుబాటు లోకి రానున్న 50 ట్రాన్స్‌ఫాండర్లతో డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్‌లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఇస్రో వెల్లడిందింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isro  GSAT-18  ariane-5  kourou  french guiana  science and technology news  

Other Articles