భారత రిపోర్టర్ ను బయటకు పంపిన నవాజ్ షరీప్ Iss Indian Ko Nikalo.. Journo Evicted From Pak Briefing at UN

Indian journalist asked to leave pak foreign secy s press meet in us

NDTV journalist, indian journo, indian scribe, UN General Assembly, New York, Uri attack, Uri terror attack, Uri, Jammu and Kashmir, Nawaz Sharif, Pakistan foreign secretary briefing, Namrata Brar, Aizaz Ahmad Chaudhry

An NDTV journalist asked to leave a press briefing of the Pakistan Foreign Secretary in New York, where tension is simmering between the two countries over the terror attack in Jammu and Kashmir's Uri.

ఐక్యరాజ్య సమితి సాక్షిగా.. నవాజ్ పెదవి దాటని మాట..

Posted: 09/20/2016 03:08 PM IST
Indian journalist asked to leave pak foreign secy s press meet in us

ఐక్యరాజ్య సమితి సాక్షిగా పాకిస్థాన్ దమన నీతి బయటపడింది. ఐక్యరాజ్య సమితిలో భారత్ పై పిర్యాదులు చేయడానికి వెళ్లిన పాకిస్థాన్.. తన ద్వంద నీతిని బయటపెట్టింది. ఐక్యరాజ్యసమితిలో జరిగే ప్రెస్ మీట్ లో కూడా భారతీయ పాత్రికేయులను బయటకు పంపింది. దీనిని బట్టి పాకిస్థాన్ చేస్తున్న దురాగతాలు బయటపడుతున్నాయి. కేవలం తమ దేశ మీడియాకు మాత్రమే అనుమతించేందుకు అది న్యూయార్క్ అని తెలిసినా.. తమ దేశం కాకపోయినా.. మరో అలోచనలేకుండా మన విలేకరులను బయటికి పంపారు.

కాశ్మీర్ లో భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని పిర్యాదు చేయడానికి ఐక్యరాజ్య సమితికి వెళ్లిన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అక్కడ భారత పాత్రికేయుడి ఉద్దేశించి.. ఇస్ ఇండియన్ జర్నలిస్టుకో నికాల్దోం అని భద్రతా సిబ్బందికి అదేశించాడు. అయితే భారత్ పై పిర్యాదు చేయడానికి వచ్చిన ప్రధాని ఇండియన్ జర్నలిస్టుపై అక్కస్సు వెళ్లగక్కడానికి కారణమేంటి..? షరీఫ్ కు కోపం తెప్పించిన భారత పాత్రికేయుడి ప్రశ్న ఏంటి..? దానికి షరీఫ్ ఇచ్చిన సమాధానమేంటి..?

యురి ఉగ్రదాడి ఘటనపై మాట్లాడేందుకు పాక్ ప్రధాని నిరాకరించారు. యురిదాడి గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. ఈ దుశ్చర్యపై ఆయన ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. ఈ విషయంపై మాట్లాడేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పారు. భారత్కు చెందిన ఓ పాత్రికేయ ప్రతినిధి యురిదాడి గురించి ప్రశ్నించగా, పాక్ ప్రధాని అసహనం వ్యక్తం చేశారు. అంతటితో అగకుండా మన మీడియా ప్రతినిధిని సమావేశం నుంచి బయటకు పంపాల్సిందిగా తన సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఆయన్ను సమావేశం నుంచి బయటకు పంపారు. ఇక షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ కూడా యురి ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan PM  Nawaz Sharif  indian journalist  Uri attack  NDTV  

Other Articles