సైనికులపై మరోసారి పిచ్చి ప్రేలాపన | Kanhaiya Kumar's Take On Those Who Join The Army.

Kanhaiya kumar s take on those who join the army

JNU Kanhaiya Kumar again comment on Army, Kanhaiya comments on Who Join The Army, kanhaiya comments after Uri Attack, Uri attack kanhaiya video

JNU Kanhaiya Kumar's Take On Those Who Join The Army.

ITEMVIDEOS:కన్నయ్య కారుకూతలు ఎంత దారుణం!

Posted: 09/20/2016 04:47 PM IST
Kanhaiya kumar s take on those who join the army

గడ్డకట్టించే మైనస్ 60 డిగ్రీల చలిలో నిరంతరం పహారా కాస్తూ, తమ కుటుంబానికి దూరంగా ఉంటూనే, కోట్లాదిమంది కుటుంబాలకు రక్షణగా నిలుస్తున్న మన హీరోలు. పాక్ దొంగ దెబ్బలకి సహచరులు అసువులు బాస్తున్న వెన్ను చూపని వీరత్వంతో, యుద్ధవీరులు ముందడుగులు వేస్తూనే ఉన్నారు. అలాంటి వారిపై నీచపు వ్యాఖ్యలు చేయటం ఓ విద్యార్థి సంఘ నాయకుడి హోదాలో కన్నయ్య కుమార్ కి గొప్పగా అనిపించొచ్చు.

దేశ సార్వభౌమానికి ప్రతీక అయిన పార్లమెంట్ పై దాడి చేసిన ఓ కరడుగట్టిన ఉగ్రవాది పై అనుకూల నినాదాలు చేసి వార్తల్లోకి ఎక్కి, పాపులర్ అయి టీవీల్లో నానటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఫలితం దేశ ద్రోహం కేసులో జైలుకు వెళ్లి రావటం. పోనీ షరతులతో కూడిన బెయిట్ మీద వచ్చినప్పటికీ బుద్ధి మారిందా? నాలుగు రోజులు ఇలా అయ్యిందో లేదో అత్యాచారాలు చేస్తున్నారంటూ కశ్మీర్ ఆర్మ్డ్ ఫోర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రాణాలు సైతం పణంగా పెట్టి కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతున్న వారిపై నిందలు వేయటం కన్నయ్య ఔనత్యానికి నిదర్శనం. తాజాగా అతని మరో వీడియో ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

గత్యంతరం లేకే యువత ఆర్మీలో చేరుతున్నారే తప్ప దేశంపై ప్రేమతో కాదంటూ అర్థం వచ్చేలా అందులో మాట్లాడాడు. చదువులు పాసవుతున్నారు.. ఉద్యోగాలు దొరకటం లేదు. అందుకే సైన్యంలో చేరిపోతున్నారు అంటూ అందులో ఉంది. ఇది ఎప్పుడు, ఎక్కడ మాట్లాడాడో తెలీదు గానీ, 20 మంది ఆర్మీ సిబ్బందిని యూరీ దాడిలో ఉగ్రవాదులు బలి తీసుకున్న ఈ సమయంలో బయటికి వచ్చింది. ఓవైపు పాక్ కి హెచ్చరికలు జారీ చేస్తూ ఓ సైనిక అధికారి వీడియో వైరల్ అవుతున్న దశలోనే... కన్నయ్య కుమార్ కూసిన కారుకూతలు ఓసారి చూడండి. రెండింటికి ఎంత తేడానో? అసలు అలా మాట్లాడటానికి, స్వేచ్ఛగా తిరగటానికి కారణం వారేనన్న విషయం ఎప్పటికీ గమనిస్తాడో ఏమో?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JNU leader  Kanhaiya Kumar  Army  Again  

Other Articles