కేంద్రమంత్రి నడ్డా, కన్నయ్య కుమార్ లకు చేదు అనుభవం Kanhaiya Kumar Modi-ed out at Youth Summit

Ink thrown at union minister nadda in bhopal s aiims

J.P. Nadda, AIIMS Bhopal, ink thrown at nadda, assult on union minister, protest against nadda, jawaharlal nehru university, former student leader, kanhaiya kumar, kanhaiya kumar india today mind rocks, kanhaiya kumar sedition, crime

AIIMS Bhopal students thew ink at Union Health Minister J P Nadda in protest against the “poor” facilities at the medical institution.

కేంద్రమంత్రి నడ్డా, కన్నయ్య కుమార్ లకు చేదు అనుభవం

Posted: 09/17/2016 07:45 PM IST
Ink thrown at union minister nadda in bhopal s aiims

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు చేధు అనుభవం ఎదురైంది. భోపాల్‌లోని ఎయిమ్స్‌ను సందర్శించేందుకు వెళ్లిన ఆయనపై  అక్కడి మెడికోలు ఇంకు చల్లారు. వివరాల్లోకి వెళ్తే.. కేంద్ర మంత్రి నడ్డా ఇవాళ భోపాల్ లోని ఎయిమ్స్‌కు వెళ్లారు, అసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలని, కనీస అవసరాలు కూడా లేకుండా తాము విదులు నిర్వహించడం కష్టంగా వుందని మెడికోలు ఆయనకు విన్నవించారు. అప్పటికే పలువురు మెడికోలు ఆయన పర్యటన నేపథ్యంలో అక్కడికి చేరుకుని కేంద్రమంత్రిని ఘోరావ్ చేశారు. ఆయన అవేమి పట్టించుకోనట్టు వెళ్తుండటంతో కోపోద్రిక్తులైన కొందరు మెడికోలు ఆయనపై ఇంక్ చల్లారు. ఆయన కారులోకి వెళ్లి కూర్చున్న వదలలేదు. పెన్నుతో సిరా చల్లుతూనే ఉన్నారు. దీంతో ఆయన తెల్లని చోక్కాతో పాటు తెల్లని కారుపై కూడా సిరా చుక్కలు పడ్డాయి. ఆనంతరం మెడికోలు మాట్లాడుతూ.. తాము మంత్రికి సమస్యలను వివరిస్తామని ఒక నిమిషం నిలబడమని విజ్ఞప్తి చేసినా ఆయన పట్టించుకోకుండా వెళ్లిపోయారని ఆరోపించారు.

అటు జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్కు కూడా చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలో ఓ సెమినార్లో పాల్గొన్న కన్నయ్య కుమార్ ప్రధానమంత్రిని టార్గెట్ గా చేసకుని విమర్వలు గుప్పిస్తుండగా సభికులు అయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రసంగానికి అడ్డుతగిలారు. దేశంలో ప్రజలు వీధుల్లో, జైళ్లలో ఉంటున్నారని, ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్రమోదీ పుట్టిన రోజు వేడుకలు ఎందుకు జరుపుకుంటున్నారంటూ కన్నయ్య విమర్శలు ఎక్కుపెట్టాడు. దేశంలో 65 శాతం యువత ఉండగా.. 65 ఏళ్ల వ్యక్తి వారికి నాయకుడిగా ఎలా ఉంటారు అంటూ ప్రశ్నించాడు. ఆ సమయంలో అక్కడివారు కన్హయ్య ప్రసంగానికి అడ్డుపడటంతో 'దేశంలో స్వేచ్ఛ ఉంది. ఇలా అడ్డు తగులుతున్న మీపై ఎవరూ దేశ ద్రోహం కేసు నమోదు చేయరు' అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles