మోహన్ బాబుకు నవరస నట తిలకం అవార్డు ప్రధానం mohan babu honoured with navarasa nata tilakam award

Mohan babu honoured with navarasa nata tilakam award

Mohanbabu, T.subbiramireddy, tsr birthday celebrations, megastar chiranjeevi, kurian, venkatesh, sunil, jayasudha, sridevi, boney kapoor, raj tarun, raghavendra rao, paruchuri gopala krishna, Indira priyadarshini stadium, vishakapatnam, tollywood

Actor mohan babu honoured with navarasa natatilakam award on rajyasabha member t.subbiramireddy birthday celebrations at vizag

మోహన్ బాబుకు నవరస నట తిలకం అవార్డు ప్రధానం

Posted: 09/17/2016 09:56 PM IST
Mohan babu honoured with navarasa nata tilakam award

రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి 73వ జన్మదినం సందర్భంగా విశాఖలోని ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబుకు టిఎస్‌ఆర్‌ లలితా కళాపరిషత్‌ ఆధ్వర్యాన 'నవరస నటతిలకం' బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబుకు మెగాస్టార్‌ చిరంజీవి స్వర్ణ కంకణం తొడిగారు. రాజసభ్య డిప్యూటీ ఛైర్మన్‌ పిజి కురియన్‌, దాసరి నారాయణ రావు, గంటా శ్రీనివాసరావు, చిరంజీవి, వెంకటేష్‌, నాగబాబు, శ్రీదేవి, బోనికపూర్‌, జయప్రద, జయసుధ, బ్రహ్మానందం తదిత రులు మోహన్‌బాబుకు జ్ఞాపిక బహూకరించి సత్కరించారు.

ఈ సందర్భంగా రాజసభ్య డిప్యూటీ ఛైర్మన్‌ పిజి కురియన్‌ మాట్లాడుతూ.. దేశంలో అందరికీ సుపరిచిత నటుడు మోహన్‌బాబు అని కొనియాడారు. సినీ ఫీల్డ్‌లో 40 ఏళ్ల పాటు కొనసాగడం అరుదని, అలాంటి మోహనబాబు వివిధ పాత్రలు పోషిస్తూ నటుడుగా రాణించారని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు సుబ్బి రామిరెడ్డి మాట్లాడుతూ మోహన్‌బాబుతో మొదటి నుంచీ ఉన్న అనుబంధం వల్ల 40వసంతాల వేడుకలను (సినీ ఫీల్డ్‌లోకి వచ్చి) విశాఖలో నిర్వహించేందుకు ఒప్పుకు న్నారన్నారు. తనకున్న ఆత్మీయుల్లో మోహన్‌ బాబు ఒకరని, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా పేరు సంపాదించారని కొనియాడారు.

ఈ వేడుకల్లో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు, ఏసుదాసు, పరుచూరి గోపాలకృష్ణ, మణిశర్మ, వందేమాతరం శ్రీనివాస్‌, మాజీ కర్టాటక సిఎం కుమారస్వామి, దగ్గుబాటి సురేష్‌బాబు, అల్లు అరవింద్‌, సునీల్‌, రాజ్‌తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు. సుబ్బిరామిరెడ్డి జన్మదిన వేడుకలకు సినీ ఇండిస్టీ మొత్తం విశాఖకు తరలివచ్చింది. దీంతో నగరమంతా సినీసందడి అలముకుంది. తమతమ అభిమానులను చూడటానికి జిల్లా నలుమూలల నుంచి అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో నగరం కిటకిటలాడింది. వేడుకలకు సుమారు 50 వేల మంది తరలివచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles