భారత్ ను అలా అంటుంటే.. అవమానిస్తుంటే.. Abroad People calling India land of rapes embarrassing

People calling india a land of rapes is embarrassing says amitabh bachchan

Amitabh Bachchan, rapes, land of rapes, India, embarrassing, abroad, true, India, nation, Pink, Delhi, Mumbai

It's very embarrassing when we visit abroad and people there say, 'You are from India, the land of rapes'. I want that to go.

భారత్ ను అలా అంటుంటే.. అవమానిస్తుంటే..

Posted: 09/17/2016 06:34 PM IST
People calling india a land of rapes is embarrassing says amitabh bachchan

భారత దేశం అనగానే విదేశీయులకు ఇక్కడ సంస్కృతి. సంప్రదాయాలు చటుక్కున గుర్తుకువస్తుంటాయి. అందులోనూ అడవారిని ఇక్కడ దేవతలుగా అరాధించే భూమిగా విదేశీయులకు మన ధరణిపై మక్కువ ఎక్కువ. యత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమ్యతే దేవతా అన్న సంస్కృత శ్లోకం కూడా వారు పఠిస్తుండేవారు. అలాంటిది సుమారు రెండు దశాబ్దాలుగా భారత్ లో అబలలపై జరుగుతన్న అకృత్యాలు దేశ గౌరవ మర్యాదలను హరించాయి. ఇన్నాళ్లు వేనోళ్ల పొడిగిన విదేశీయులే.. ఇప్పుడు దేశాన్ని దారుణంగా అవమానిస్తున్నారు. ఎంతలా అంటే బాలీవుడ్ మెగాస్టార్ కూడా విదేశీయుల మాటలకు సిగ్గుపడాల్సి వచ్చింది. ఈ విషయాలను ఆయనే స్వయంగా వెలిబుచ్చారు.

తాను విదేశాలకు వెళ్లినప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాననిఅమితాబ్ బచ్చన్ చెప్పారు. అక్కడి వారు ఇండియాను ల్యాండ్ ఆఫ్ రేప్స్‌గా పిలుస్తున్నారని తెలిపారు. ఈ విషయం తనను చాలా బాధకు గురిచేసిందని పేర్కొన్నారు. మీరు ఇండియాకు చెందిన వారా? అదే ల్యాండ్ ఆఫ్ రేప్ ప్రాంతం అని అక్కడి వారు తనతో అంటుంటే ఆ బాధను తట్టుకోలేకపోయానని అమితాబ్ చెప్పారు. ఆయన పింక్ సినిమాలో లాయర్ పాత్రలో నటించారు.

మన మంతా కష్టపడి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. దేశంలో ఎక్కడైనా సరే మహిళలకు రక్షణ ఉండాలని చెప్పారు.  ఈ సందర్భంగా ఆయన ‘‘ఢిల్లీ తదితర ప్రాంతాల్లో మహిళలకు రక్షణ ఉందని తాను అనటం లేదు. మన మంతా ఓ దేశం. దేశంలోని ప్రతి ప్రాంతంలో మహిళలకు రక్షణ ఉండాలన్నదే మన ప్రధాన ఉద్దేశం. మహిళ పట్ల ఢిల్లీలో ఏదైనా సంఘటన జరిగితే దేశంమంతా బాధపడాలి. విచారం వ్యక్తం చేయాలి. మనమంతా ఒక్కటే అన్న భావన అందరిలో కలగాలి’’ అని అమితాబ్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amitabh Bachchan  rapes  land of rapes  India  embarrassing  abroad  true  India  nation  Pink  Delhi  Mumbai  

Other Articles