ఆ మూడు అడ్డుకుంటున్నాయి.. జియో సంచలన అరోపణలు Reliance Jio claims operators are violating number portability norms

Reliance jio claims operators are violating number portability norms

reliance, reliance jio, reliace jio sim, jio network, airtel, vodafone, idea, number portability, port number to jio, port number to reliance jio, port number to jio 4g, telecos, telecom operators india, india, trai, technology

Reliance Jio seeks TRAI's intervention over Airtel, Vodafone and Idea refusing to allow porting of their subscribers to Jio

ఆ మూడు అడ్డుకుంటున్నాయి.. జియో సంచలన అరోపణలు

Posted: 09/16/2016 10:32 AM IST
Reliance jio claims operators are violating number portability norms

మార్కెట్లోకి వచ్చి పోటీదారుల నుంచి కష్టమర్లను అకర్షిస్తున్న తమ ఖాతాదారుల జాబితాను పెంచుకుంటున్న రిలయన్స్ జియో తన పోటాదారు టెలికం కంపెనీలపై సంచలన అరోపణలు చేసింది. పలు టెలికాం సంస్థల నుంచి తమ కస్టమర్లుగా చేరేందుకు అసక్తి కనబరుస్తున్న కస్టమర్లకు.. యూజర్ల మొబైల్ నంబర్ పోర్టబిలిటీని అడ్డుకుంటున్నాయని రిలయన్స్ జియో ఆరోపించింది. ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ వంటి సంస్థలు.. వారి కస్టమర్లు కొత్త నెట్‌వర్క్‌కి మారడానికి రిక్వెస్ట్‌లు పంపితే వాటిని అంగీకరించలేదని పేర్కొంది. ఈ నెల 9 నుంచి 12 మధ్య కాలంలో పోర్టబిలిటీ కోసం చేసిన రిక్వెస్ట్‌లను తిరస్కరించాయని వివరించింది.

ఇలా పోర్టబిలిటీ కోరిని వాటిలో తమ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగుల నుంచి వచ్చిన 4,919 రిక్వెస్ట్‌లు కూడా వున్నాయని అరోపించింది. ఇలాంటి చర్యలు లెసైన్స్ నిబంధనలకు విరుద్ధమని తెలియజేసింది. టెల్కోలు లెసైన్స్ నిబంధనలను కచ్చితంగా అమలుచేసేలా చూడాలని ట్రాయ్‌ని కోరింది. ఈ మేరకు జియో ఈ అంశాలను ప్రస్తావిస్తూ ట్రాయ్‌కి ఒక లేఖ రాసింది. టెల్కోలు నిబంధనలను అమలు చేయని పక్షంలో వాటి లెసైన్స్‌ను రద్దు చేయాలని తెలిపింది. అయితే ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ సంస్థలు రిలయన్స్ చేసిన అరోఫణలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అ అరోపణల్లో బలముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reliance Jio  telecom companies  portability  Airtel  Idea  Vodafone  

Other Articles