భారీ లాభాలతో దూసుకెళ్తున్న సూచీలు Sensex, Nifty gain heavy profits

Sensex nifty gain heavy profits

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

With a positive trend from abroad markets Sensex, Nifty gain heavy profits, Sensex jumps 300 points nifty regains 8800 mark as banking auto shares rally

భారీ లాభాలతో దూసుకెళ్తున్న సూచీలు

Posted: 09/16/2016 11:51 AM IST
Sensex nifty gain heavy profits

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాల ప్రభావంతో ఇవాళ ఉదయం ట్రేడింగ్లో స్టాక్మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకొచ్చాయి. మార్కెట్లు ప్రారంభంతోనే సెన్సెక్స్ ఏకంగా 250 పాయింట్లకు పైగా జంప్ అయి, ప్రస్తుతం 328 పాయింట్ల లాభంతో 28,741 వద్ద ర్యాలీ కొనసాగిస్తోంది. నిఫ్టీ సైతం 95 పాయింట్ల ర్యాలీతో తన కీలకమార్కు 8,800ను అధిగమించి 8,837 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా రిటైల్ విక్రయాలు ఆగస్టు నెలలో 0.3 శాతం క్షీణించడంతో వడ్డీ రెట్లు పెంచేందుకు ఫెడరల్ విముఖత వ్యక్తం చేస్తుందన్న సంకేతాలు అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లు పుంజుకునేందుకు దోహదపడ్డాయి.
 
దీంతో గత కొంతకాలంగా నెలకొన్న ఫెడ్ రేట్ల భయాలు వైదొలగడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. అదేవిధంగా బ్యాంకింగ్, ఆటో స్టాక్స్లో కొనుగోల ర్యాలీ కొనసాగుతుండటంతో మార్కెట్లు లాభాల పంట పండిస్తున్నాయి. బ్యాంకింగ్, ఆటో షేర్ల ఎన్ఎస్ఈ సబ్ సూచీలు 1.06శాతం, 1.11 శాతం ఎగిసి, మార్కెట్లో ర్యాలీ కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ స్టాక్స్లో హీరో మోటాకార్పొ 2.5 శాతం లాభంతో టాప్ గెయినర్గా ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా బ్యాంకు ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఆటో, అంబుజా సిమెంట్స్ లాభాలను పండిస్తున్నాయి. ఏషియన్ పేయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీలు నిఫ్టీలో నష్టాలను చవిచూస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles