ఆ ఫోటోలు పెట్టారంటూ పేరెంట్స్ పై యువతి కేసు | Daughter sues parents for posting childhood pics

Daughter sues parents in austria for posting photos of her on facebook

Austria Daughter sues parents, Daughter sues for posting her photos, daughter sues for Childhood pics, Parents post daughter childhood photos, Parents lands in trouble for posting daughter photos, daughter those photos published by parents, girl embarassed with parents photos

Daughter sues parents for posting her childhood photos on Facebook in Austria.

షాక్ : ఆ ఫోటోలు పెట్టారంటూ పేరెంట్స్ పై యువతి కేసు

Posted: 09/16/2016 11:53 AM IST
Daughter sues parents in austria for posting photos of her on facebook

తల్లిదండ్రులు తమ పిల్లలపై అమితమైన ప్రేమ చూపించడం కామన్ అయిన విషయమే. అయితే ఒకగానోక్క కూతురి అయిన తనపై అమితమైన ప్రేమతో ఆ తల్లిదండ్రులు చేసిన పనికి ఆ గారాలపట్టి ఏకంగా కోర్టులో కేసు వేసింది. తన అభ్యంతరకర ఫోటోలు షేర్ చేశారంటూ గగ్గోలు పెట్టింది. అసలు ఇంతకు ఏం జరిగింది?

ఆస్ట్రియాకు చెందిన 18 ఏళ్ల యువతి తన పెరేంట్స్ పై కోర్టుకెక్కింది. 2009 నుంచి ఆమెకు సంబంధించిన సుమారు 500 ఫోటోలు వారు ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు. అయితే ఆ ఫోటోలు తనకున్న 700 మంది ఫ్రెండ్స్ కి కూడా షేర్ కావటంతో ఆ యువతి అప్ సెట్ అయ్యింది. అసలు అంతగా అందులో ఏముంది అంటారా? చిన్నతనం నుంచి ఆమె ఫోటోలను వారు అందులో పెట్టారు.

చిన్నతనంలో నేపీ మార్చటం దగ్గరి నుంచి, టాయిలెట్ ఎలా వెళ్లాలో పాటీలో కూర్చున్న ఫోటోలను కూడా వారు అందులో పెట్టేశారు. దీంతో తన స్నేహితుల ముందు తన పరువు పోయిందని ఆ యువతి ఆరోపించింది. అయితే తన కూతురి ఫోటోలు షేర్ చేసేందుకు తనకు హక్కు ఉందని ఆ యువతి తండ్రి చెబుతున్నాడు. ఆస్ట్రియాలో ఇలాంటి కేసు మొదటిసారి నమోదుకాగా, దీనికోసం రిఫరెన్స్ లు వెతుకుంటున్న న్యాయస్థానం నవంబర్ దాకా కేసును వాయిదా వేశాయి.    

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Austria  Daughter  sue  parents  posting  childhood  photos  

Other Articles