భార్యమణికి భరణం.. అమ్మో అంతా..! Kunlun Tech Chairman settles $1B Divorce

Kunlun tech chairman agrees to 1b divorce settlement in a share s most expensive split

Chinese online gaming firm, Beijing, Kunlun Tech Co., Ltd. Kunlun Tech chairman, Zhou Yahui, RMB7.5 billion, US$1.1 billion, divorce agreement, expensive divorce, 8470 crores, video game company ceo, Beijing, china

Chinese online gaming firm Beijing Kunlun Tech Co., Ltd. disclosed yesterday that its chairman Zhou Yahui (pictured) has reached a RMB7.5 billion (US$1.1 billion) divorce agreement with his wife,

భార్యమణికి భరణం.. అమ్మో అంతా..!

Posted: 09/13/2016 05:49 PM IST
Kunlun tech chairman agrees to 1b divorce settlement in a share s most expensive split

ప్రపంచంలో బిలియనీర్‌ జంటలు విడిపోవడం పెద్ద వింతేమీ కాదు. పురుషులతో సమాన నిష్పత్తిలో వుండాల్సిన మహిళలు అందుకు భిన్నంగా చాలా తక్కువగా వున్న దేశం చైనాలో కూడా సంపన్నుల విడాకులు సర్వసాధారణమే. అయితే విడిపోయేటప్పుడు అప్పటివరకు జీవితంలో సగభాగంగా జీవించిన భార్యకు ఆస్తిలో సగభాగాన్ని పంచివ్వడం మాత్రం చాలా అరుదు. చైనాలో అలా చేయడాన్ని వింతగా కూడా పరిగణిస్తారు. చైనా చరిత్రలోనే ఇప్పుడు అత్యంత ఖరీదైన విడాకుల సంఘటన చోటు చేసుకుంది.

వీడియో గేమ్‌లను తయారు చేయడంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'బీజింగ్‌ కున్‌లున్‌ టెక్‌' కంపెనీ చైర్మన్, సీఈవో ఝౌ యుహి (39), ఆయన భార్య లీ (38) విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరి పేరిట కలిసి 26,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వాటిలో దాదాపు 17 వేల కోట్ల రూపాయలను పంచాల్సి ఉంది. ప్రస్తుతం ఆ కార్యక్రమం కొనసాగుతోందని, తలా 8,470 కోట్ల రూపాయలు వస్తాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు చైనాలో నమోదవుతున్న అత్యంత ఖరీదైన విడాకులు ఇవేనని సిన్హువా వార్త సంస్థకు చెందిన షాంఘై సెక్యురిటీస్‌ న్యూస్‌ తెలియజేసింది.

గతంలొ ఓ చైనా వ్యాపారి తన రష్యా భార్యకు విడాకుల ఒప్పందం కింద 7,400 కోట్ల రూపాయలను చెల్లించారు. ఇప్పుడు ఆ రికార్డును యుహి జంట బ్రేక్‌ చేసిందని షాంగై సెక్యూరిటీస్‌ న్యూస్‌ తెలిపింది. విడిపోతున్న భార్యాభర్తల స్పందనలను తెలుసుకునేందుకు ప్రయత్నించగా, వారు మీడియా ముందుకు రావడానికి నిరాకరించారని చెప్పింది. చైనాలో ఇటీవల కాలంలో విడాకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2000లో ఈ సంఖ్య 12 లక్షలు ఉండగా, 2009 సంవత్సరానికి 25 లక్షలకు, గతేడాదికి 38 లక్షలకు చేరుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : expensive divorce  8470 crores  video game company ceo  Beijing  china  

Other Articles

Today on Telugu Wishesh