చాకెట్ల ఆశ చూపి పాపను సైకిల్ మీద ఎత్తుకెళ్లాడు | four years kid kidnapped by 8 years boy in Raipur

Four years kid kidnapped by 8 years boy in raipur

Raipur 4 years kid Kidnapped, 4 years kidnapped by 8 years boy, Minor Kidnapper, Minor Kidnapper in Raipur

Four years kid kidnapped by 8 years boy in Raipur.

ITEMVIDEOS:చాకెట్ల ఆశ చూపి నాలుగేళ్ల పాపను 8 ఏళ్ల బాలుడు...

Posted: 09/13/2016 06:06 PM IST
Four years kid kidnapped by 8 years boy in raipur

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని రాయ్‌పూర్ లో ఓ కేసు విషయంలో పోలీసులు తలపట్టుకుంటున్నారు. కబీర్‌న‌గ‌ర్‌లో ఓ ఐదేళ్ల పాప అదృశ్యం కావటం పెద్ద కలకలమే రేపింది. ఆ చిన్నారిని ఎత్తుకెళ్లింది ఎవరో కనిపెట్టినపోలీసులు ఔరా అంటూ నోళ్లు వెళ్లబెట్టారు. ఇంతకీ ఆ ఘన కార్యం చేసింది 12 ఏళ్ల బాలుడు కావటం విశేషం.

రామ్ కుమార్ సాహు కుమార్తె లాడో సాహు త‌మ ఇంటి ఆవర‌ణ‌లో ఆడుకుంటూ ఉండ‌గా ఒంటరిగా ఉండ‌డాన్ని చూసిన ఆ బాల కిడ్నాప‌ర్ పాప‌కు మాయ‌మాట‌లు చెప్పాడు. చాక్లెట్లు కొనిస్తాన‌ని ఆశపెట్టాడు. ఆ చిన్నారిని ఆడిస్తున్న‌ట్లు నాట‌క‌మాడి, పాప‌పై ఓ ట‌వ‌ల్ కప్పాడు. ఆ త‌రువాత‌ సైకిల్‌పై ఎక్కించుకొని ఎంచక్కా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాల‌న్నీ అక్క‌డి సీసీ కెమెరాల్లో నిక్షిప్త‌మ‌య్యాయి. అలా చిన్నారిని కొంత‌దూరం సైకిల్‌పై తీసుకెళ్లిన బాలుడు తరువాత పాప‌ను సైకిల్ పై నుంచి తనతోపాటు ఊరంతా నడిపించుకుంటూ తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ నగరంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాపర్ల నుంచి చిన్నారి తల్లిదండ్రులకు ఎలాంటి కాల్ రాలేదు. రాయ్‌పూర్ ప్రాంతంలో పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఏదైనా ముఠా ఆ బాలుడి తో ఈ పని చేయించిందా? లేదా బాల సైతాన్ అందులో ఓ సభ్యుడా? మరేమైనా కారణాలున్నారా అనే అంశాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chhattisgarh  Raipur  4 years  kid  Kidnap  8 years boy  

Other Articles