ఇప్పటి రాజకీయాల్లో రాణించడం కష్టమే: మాజీ ప్రధాని Former No10 chief David Cameron could rake in millions

Former no10 chief david cameron could rake in millions

uk, uk parliament, david cameron, david cameron resignation, cameron resignation, david cameron resignation, world news, uk parliament, rig veda, rig veda in uk, indian uk citizen, nri, india news, world news

Former British PM David Cameron resigns as MP with immediate effect. The 49-year-old Conservative leader had initially said he would continue as an MP until the next general election.

ఇప్పటి రాజకీయాల్లో రాణించడం కష్టమే: మాజీ ప్రధాని

Posted: 09/13/2016 06:14 PM IST
Former no10 chief david cameron could rake in millions

బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. బ్రెగ్జిట్ పోల్స్ లో వీగిపోవడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన కామెరాన్ తాజాగా పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన సమకాలీన రాజకీయాల్లో కొనసాగడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. అందుకే పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. అయితే తదుపరి సార్వత్రిక ఎన్నికల వరకు కొనసాగడంపై సుముఖత వ్యక్తం చేశారు.

ప్రస్తుత బ్రిటన్ ప్రధాని థెరెస్సా మేపై అందరికీ నమ్మకం ఉందని, ఆమె నాయకత్వంలో బ్రిటన్ మరింత ముందుకు వెళ్తుందని భావిస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రధానులుగా వైదొలగినప్పటికీ మాజీ ప్రధానులు చాలా మంది పార్లమెంటులో సభ్యత్వం కలిగి ఉన్నారు. అయితే తాను ప్రధానిగా ఉండగా పెండింగ్ లో పెట్టిన బిల్లులను థెరెస్సా మే పాస్ చేయడంపై కినుక వహించిన కామెరాన్ పార్లమెంటు ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uk parliament  david cameron  resignation  conservative leader  MP  

Other Articles