ఏపీ సాయంపై గందరగోళం | suspense on AP special pacakage announcement

Suspense on ap special pacakage announcement

AP special pacakage announcement, AP special Status, Central on AP status, AP special status, venkaiah Naidu And Arun Jaitley on AP, Arun Jaitley on AP package, venkaiah Naidu on AP package

ఏపీ సాయంపై గందరగోళం | suspense on AP special pacakage announcement

ఏపీ సాయంపై ఎందుకీ పితలాటకం?

Posted: 09/07/2016 05:59 PM IST
Suspense on ap special pacakage announcement

క్లైమాక్స్ చేరిన నవ్యాంధ్ర ప్రత్యేక అంశంలో ఎలాంటి ప్రకటన రాబోతుందా అన్న టెన్షన్ ఏపీ ప్రజల్లో నెలకొంది. ఏపీకి సాయంపై అతి త్వరలోనే తేలుస్తామని, అవసరమైతే ఈరోజే ప్రకటన రావొచ్చని అరుణ్ జైట్లీ చెప్పటంతో సాయం ఏ రేంజ్ లో ఉండబోతుందా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి . ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన హోదాకు తగిన నిష్పత్తిలో ఆర్థిక ప్యాకేజీ ఉంటుందని, ఇప్పటికే 25 విద్యాలయాలు మంజూరు చేశామని, అంశంపై తొందరపాటు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. వెరసి  అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టే సందర్భంగా రాష్ట్రానికి పలు హామీలు ఇస్తూ, అంతకుమించి, ప్రత్యేక హోదాను ఇస్తామని చెబుతూ ఆశపెట్టి, ఇప్పుడు వాటిని తీర్చేందుకు మీనమేషాలు లెక్కిస్తున్న కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏపీ ప్రజలను మోసం చేసే దిశగానే అడుగులు వేస్తోందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే గత వారం పది రోజులుగా, ఏపీకి సాయంపై కొనసాగుతున్న సస్పెన్స్‌ కు తెరదించేలా సంకేతాలు ఇస్తూ, హడావుడిగా కదిలిన బీజేపీ నేతలు, మళ్లీ కథను మొదటికి తేలేకపోయే అవకాశం కూడా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేంద్ర మంత్రలు రాజ్ నాథ్ సింగ్, జైట్లీతో వరుస భేటీలు జరుపుతూ, హోదా స్థానంలో అంతకన్నా ఎక్కువ లాభం కలిగించే ప్యాకేజీని తయారు చేశామని చెబుతూ, సీఎం చంద్రబాబునాయుడిని ఢిల్లీకి రావాలని రాయబారం పంపటం లాంటి హైడ్రామాలతో కథ క్లైమాక్స్ కు చేర్చినట్టే కనిపించింది. ప్యాకేజీలోని అంశాలను చంద్రబాబుకు వివరించి ఆయన అనుమతిని తీసుకోవాలన్నది కేంద్రం అభిమతం. అయితే, గత రెండు రోజులుగా వస్తున్న లీకులతో హోదా అంశాన్ని పూర్తిగా విస్మరించేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని వైకాపా, కాంగ్రెస్ తదితర విపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆపై ప్రజల్లో నెలకొన్న హోదా సెంటిమెంట్ కు ఎసరు పెడితే, తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన చంద్రబాబు, ప్యాకేజీకి తాను వ్యతిరేకమని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ సభ పెడుతుండటం, పైగా కార్పొరేషన్లు, మునిసిపల్ ఎన్నికలు జరగనున్న వేళ, ఈ సమయంలో హోదా రాలేదని తెలిస్తే, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న అభిప్రాయాన్ని ఈ ఉదయం మంత్రులతో చంద్రబాబు జరిపిన సమావేశంలో టీడీపీ నేతలు వెలిబుచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదాపై పట్టువీడకుండా చంద్రబాబు ఒకింత కటువుగానే వ్యాఖ్యలు చేసి తన మనసులోని భావాన్ని బయటపెట్టారు.

ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. చంద్రబాబు అంగీకరించకుండా, తమకు తాము ప్యాకేజీపై ప్రకటన చేస్తే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. హోదా ప్రయోజలనాలన్నింటినీ కూర్చి ఓ ప్యాకేజిగా తయారుచేసినట్టు కేంద్రం చెబుతున్నా, దానిలోని వివరాలు తెలియకుండా తాను స్పందించబోనని చంద్రబాబు కరాఖండీగా చెప్పేశారు. ఢిల్లీకి వెళ్లేది కూడా లేదన్నారు. దీంతో కేంద్రం, తెలుగుదేశం పార్టీల మధ్య జరుగుతున్న హోదా/ప్యాకేజీ చర్చలు అర్థంతరంగా ముగిసినట్టేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఏపీ స్పెషల్ పై నేడే ప్రకటన... భారీ ప్యాకేజీ?

మరోవైపు బీజేపీ మహిళా నేత పురందేశ్వరి హోదాపై నేడు ప్రకటన ఉండబోదని అంటోంది. ప్యాకేజీ అన్న పదానికి టెక్నికల్ గా ఇబ్బందులు ఉన్నాయని, ఒకటి రెండు రోజుల్లో జైట్లీ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఏపీకి సాయంపై మాట్లాడతారని వ్యాఖ్యానించడంతో, ఈ వ్యవహారం తిరిగి మొదటికే వచ్చినట్లయింది. ఇంకోవైపు ఈ అంశంపై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ దాదాపు ఇదే రీతిలో స్పందించలేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి హోదాపై త‌మ వైఖ‌రిని ఇప్ప‌టికే రాజ్య‌స‌భ‌లో చెప్పేశామ‌ని ఆమె అన్నారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు హోదా అంశంపై స‌మాధానం కూడా చెప్పార‌ని ఆమె గుర్తు చేశారు. అయిన‌ప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదాపై ఢిల్లీలో చ‌ర్చిస్తున్నార‌ని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర‌ విభజన స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమలు ప‌రుస్తామ‌ని తేల్చేశారు. దీంతో హఠాత్తు కేవలం ప్యాకేజీపై ప్రకటన వెలువడే ఛాన్స్ తప్ప మరేం లేదని ఢిల్లీ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  special package  announcement  jaitley  venkaiah naidu  

Other Articles