ఈవ్ టీజర్ చెంపచెల్లుమనిపించిన యువతి.. ఎమ్మెల్యే ప్రోత్భలంతో.. MLA orders girl to beat up Eve teaser

Mla orders girl to beat up eve teaser

Harassment, Mumbai, NCP MLA Jitendra Awhad, Thane, kalwa mla, Kangaroo Court, minor girl, molesting, NCP MLA, eve-teasing, harasser. maharastra, viral video

NCP leader Jitendra Awhad conducted a kangaroo court where he directed a minor girl to beat a man who was harassing her past two months, all of which was caught on camera.

ITEMVIDEOS: ఈవ్ టీజర్ చెంపచెల్లుమనిపించిన యువతి.. ఎమ్మెల్యే ప్రోత్భలంతో..

Posted: 09/07/2016 01:08 PM IST
Mla orders girl to beat up eve teaser

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవహాద్ దగ్గరుండి యువకుడిపై యువతితో దాడి చేయించారు. అంతాలా అశ్చర్యపోకండీ ఎందుకంటే అయన చేసిన పని సరైందేనని కూడా వాదనలు తెరపైకి వస్తున్నాయి. అందరు ప్రజాప్రతినిధులు ఆయనలా సమాజంలో పెడదోవ పడుతున్న యువతను సన్మార్గంలో నడిపించేందుకు చిన్నపాటి శిక్షలు వేసినా తప్పులేదని, దీంతో యువత కూడా తమ వెనుక ఎవరో వున్నారన్న భ్రమల్లోంచి భయంతో చెడుపనులను చేసేందుకు కూడా జంకుతారని అంటున్నారు మరికోందరు.

ఇదంతా థానెలోని ఆయన కార్యాలయంలో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో కలకలం రేగింది. జితేంద్ర దగ్గరుండి యువకుడిని యువతితో కొట్టించినట్టు వీడియోలోని దృశ్యాల్లో స్పష్టంగా కనబడటంతో ఆయనపై విమర్శలు సంధించే వాళ్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండగా, ఒక ప్రజాప్రతినిధికి తన పరిధిలో జరిగే చెడును కూడా అడ్డుకునే హక్కు లేదా అన్ని మరో వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. అసలు ఇంతకీ విషయం ఏమిటంటారా..?

తనను ఓ యువకుడు నిత్యం వేదిస్తున్నాడని ఓ మైనర్ బాలిక ఎమ్మెల్యేను అశ్రయించింది. అతనని ప్రేమించని పక్షంలో అఘాయిత్యాలకు కూడా పాల్పడతానని హెచ్చరించాడని జితేంద్రకు యువతి ఫిర్యాదు చేసింది. ఎంతో భవిష్యత్తు వున్న యువత పెడదారి పట్టి ఎందుకిలా మారుతున్నారని సదరు యువకుడిని తన కార్యాలయానికి పిలిపించి విచారించానని ఎమ్మెల్యే తెలిపారు. ఆ తరువాత యువకుడు నేరాన్ని అంగీకరించడంతో.. అతడికి గుణపాఠం చెప్పాలని మైనర్ బాలికతో కొట్టించానన్నారు.

అయితే తాను చేసిందాట్లో తప్పేంలేదని జితేంద్ర సమర్థించుకున్నారు. ‘నేను చట్టాన్ని చేతిలోకి తీసుకున్నానని భావించినా తప్పులేదని, తాను సమాజహితం కోసమే అలా ప్రవర్తించాను తప్ప తప్పు చేయాలన్న ఉద్దేశ్యంతో కాదన్నారు. నేను తప్పుచేసినట్టు మీడియా భావిస్తే నన్ను ఉరి తీయండ’ని ఆవేశంగా అన్నారు. ఫిర్యాదు చేసిన యువతి తన ఇంటికి సమీపంలోని మురికివాడలో నివసిస్తోందని చెప్పారు. యువకుడి వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు. యువకుడిపై వేధింపుల కేసు నమోదు చేశారు. జితేంద్ర వ్యతిరేకంగా ఎటువంటి కేసు పెట్టలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles