నయీం లైంగిక వేధింపులు మిరపరసం తాగించి మరీ..| gangster nayeem sexual harassment on girls

Gangster nayeem sexual harassment on girls

Gangster Nayeem sexual harassment, Nayeem sexual harassment, Gangster Nayeem girls, Nayeem house, Nayeem sexual harassment victims

Gangster Nayeem sexual harassment on girls.

నయీం లైంగిక వేధింపులు ఎంత ఘోరంగా ఉంటాయంటే...

Posted: 09/07/2016 06:31 PM IST
Gangster nayeem sexual harassment on girls

చేసిన పాపాలు పండ‌డంతో ఇటీవ‌ల తెలంగాణ పోలీసుల చేతిలో హ‌త‌మైన గ్యాంగ్‌స్ట‌ర్‌ న‌యీమ్ పైశాచిక చేష్టలు ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తన మాట విని లొంగిపోని వారిపై ఎంత కిరాతకంగా హింసించేవాడో, ముఖ్యంగా అతగాడి లైంగిక వేధింపులు ఎంత క్రూరంగా ఉండేవో తెలిస్తే వంట్లో వణుకు పుట్టడం ఖాయం. ఇక అతని ఇంట్లో పట్టుబడ్డ బాలిక‌ల‌ను సాక్షులుగా పేర్కొన్న పోలీసులు ఈరోజు వారి వాంగ్మూలాలను కోర్టు ముందుంచారు.

త‌న‌కు పెళ్లి చేస్తాన‌ని చెప్పి న‌యీమ్ అత్త సుల్తానా త‌న‌ను ఆరేళ్ల క్రితం న‌యీమ్ వ‌ద్ద‌కు తీసుకొచ్చిన‌ట్లు ఓ బాలిక తెలిపింది. న‌యీమ్ త‌రుచూ లైంగికంగా వేధించేవాడని, త‌మ‌పై ప‌లుసార్లు అత్యాచారం చేశాడ‌ని న‌యీమ్ బాధిత బాలికలు పేర్కొన్నారు. ఆ త‌రువాత కొన్ని ట్యాబ్లెట్ల‌ను వేసేవాడ‌ని చెప్పారు. చెప్పిన మాట వినకపోతే నయీమ్ మిరప రసం తాగించి కొట్టేవాడని బాలిక‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. న‌యీమ్ అనుచ‌రులు సుల్తానా, సాహెరా, స‌లీమా, ఫ‌యీమ్ కూడా త‌మ‌ను ఎన్నో బాధ‌ల‌కు గురిచేసేవార‌ని చెప్పారు. ఎదురు చెప్పినందుకు ఓ బాలిక‌ను న‌యీమ్ హ‌త్య చేశాడని వారు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gangster  Nayeem  sexual harassment  

Other Articles