ఆ జాబితాలోనూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ టాప్..! Smriti Irani’s ministry spent Rs 1.16 crore on office renovation

Pm modi s big four cabinet ministers show frugality at refurbishing

mukhtar abbas naqvi, pm modi, rajyavardhan rathore, smriti irani, Sushma Swaraj, Rajnath Singh, Narendra Modi, Najma Heptullah, Manohar Parrikar, jitendra singh irani, Jitendra Singh, Arun Jaitley, india news, national news

Prime Minister Narendra Modi ministers appear to have left no stone unturned in creating five-star office space for themselves. Smriti Irani tops in the list along with Mukhtar Abbas Naqvi and Rajyavardhan Singh Rathore.

ఆ జాబితాలోనూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ టాప్..!

Posted: 09/06/2016 06:46 PM IST
Pm modi s big four cabinet ministers show frugality at refurbishing

ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చి రాగానే తీసుకున్న చర్యలతో దేశప్రజలందరూ ఔరా అనుకున్నారు. అర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని ఆయన ప్రభుత్వం సురక్షిత తీరాలకు చేర్చుతుందని భావించారు. ఇందుకు ప్రధాని మోదీ తీసుకున్న పోదపు చర్యలే దేశ ప్రజలను విస్మయానికి కూడా గురిచేశారు. అయితే రానురాను ఆయన మంత్రిమండలిలోని మంత్రులు మాత్రం విమర్శకులకు అనేక అస్త్రాలను సంధించేందుకు అవకాశం ఇచ్చారు. సీనియర్ మంత్రులను మినహాయిస్తే.. జూనియర్ మంత్రులు, కోత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నారు.

తమ తమ కార్యాలయాల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని సీనియర్ క్యాబినెట్ మంత్రులు.. తమ జూనియర్లను మాత్రం తమ బాటలో నడిపించలేకపోయారు. సీనియర్ మంత్రుల సహాయ మంత్రులు మాత్రం భారీగానే ఖర్చు పెట్టి తమ ఆఫీసులకు కొత్త హంగులను సమకూర్చుకున్నారు. ఈ జాబితాలోనూ కేంద్రమంత్రి.. వివాదాలకు కేంద్రబిందువుగా పేరొందని స్మృతి ఇరానీ టాప్ ప్లేస్ సంపాదించారు. ఓ ఆర్టీఐ కార్యకర్త రాబట్టిన వివరాల మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లు ఆఫీసుల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.

ఇక మోదీ బాధ్యతలు చేపట్టిన రెండేళ్లకు 23 మంత్రుల కార్యాలయాల్లో వసతుల కల్పనకు రూ. 3.5 కోట్లను ఖర్చు చేశారు. వీరిలో స్మృతీ ఇరానీ అత్యధికంగా రూ. 70 లక్షలను, జూనియర్ మంత్రుల ఆఫీసుల కోసం మరో రూ. 40 లక్షలను వెచ్చించారని తెలుస్తోంది. నజ్మా హెప్తుల్లా ఖర్చు చేయనప్పటికీ, ఆమె నిర్వహిస్తున్న మైనారిటీ శాఖకు సహాయమంత్రిగా ఉన్న ఎంఏ నఖ్వీ రూ. 14 లక్షలతో ఆఫీసును తీర్చిదిద్దుకున్నారు. ఇక తాము కాలుమోపిన వేళ, చెత్తగా ఉన్న ఆఫీసులను సరిగ్గా చేసుకున్నామని వీరంతా చెబుతుండటం గమనార్హం. అత్యధికంగా ఖర్చు పెట్టిన వారిలో వీరేందర్ సింగ్, రాజ్యవర్థన్ రాథోడ్, ఉపేంద్ర కుష్వాహ, ఆర్ఎస్ కథేరియా, జేపీ నడ్డా, జితేందర్ సింగ్ తదితరులు ఉన్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mukhtar abbas naqvi  pm modi  rajyavardhan rathore  smriti irani  

Other Articles