వైఎస్ బాటపట్టిన యువనేత.. అధికారం హస్తగతమయ్యేనా..! Rahul Gandhi kicksoff UP poll campaign with 'Kisan Yatra', attacks PM Modi for ignoring farmers

Rahul begins kisan yatra in up

rahul gandhi, kisan yatra, rahul gandhi kisan yatra, rahul gandhi road show, rahul gandhi up yatra, kisan yatra, rahul gandhi road show up, rahul gandhi news, congress road show, congress road show up, congress road show, kisan yatra today, deoria, congress, congress up campaign, rahul gandhi kisan yatra live updates, latest news, up news

Congress vice president Rahul Gandhi accused PM Modi of ignoring farmers due to his bias towards the rich as he began a 2,500-km 'Kisan Yatra' in election-bound Uttar Pradesh.

యువనేత రైతుబాట.. అన్నదాతను విస్మరించిన మోడీ పై ధ్వజం

Posted: 09/06/2016 03:43 PM IST
Rahul begins kisan yatra in up

సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పదేళ్ల చంద్రబాబు పాలనకు చరమ గీతం పాడేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అవలంభించిన కార్యక్రమాన్నే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఇవాళ ప్రారంభించారు. 2004లో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన వైఎస్ ను స్పూర్తిగా తీసుకున్నారో ఏమో తెలియదు కానీ.. ఆయన కన్నా సుమారు వెయ్యి కిలోమీటర్లు అధికంగా పాదయాత్రచేసేందుకు రాహుల్ గాంధీ పూనుకున్నారు.

ఉమ్మడి ఏపీలో 1,467 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టగా.. రాహుల్ గాంధీ ఏకంగా 2500 కిలోమీటర్ల మేర కిసాన్ యాత్రను చేపట్టనున్నారు. ఉత్తరప్రదేశ్ లో 27 ఏళ్ల క్రితం చేజారిన అధికార పగ్గాలను చేజిక్కించుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కూడా భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.‘దియోరియా టూ ఢిల్లీ యాత్ర’ పేరిట నామకరణం చేసిన 2,500 కిలో మీటర్ల కిసాన్ పాదయాత్రను రాహుల్ గాంధీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అగ్రనేతలతో పాటు ప్రారంభించారు.

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ సార్వత్రిక ఎన్నికలకు ముందు రైతల కోసం ఎంతగానో అంగలార్చిందని, అయితే అధికారంలోని రాగానే అన్నదాతలను పూర్తిగా విస్మరించిందని ఆయన దుయ్యబట్టారు. కిసాన్ యాత్రలో భాగంగా దియోరియాలోని రైతులు, రైతు సంఘాల నేతలతో చర్చించిన అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు కేవలం సంపన్నులు మాత్రమే గుర్తుకు వస్తున్నారని వారి ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం అగ్రతాంబులం ఇస్తుందని మండిపడ్డారు.

ఉత్తర్ ప్రదేశ్ లోనూ బీజేపి నేతలు రైతులు, పేదల పక్షాన ఇప్పుడు మాట్లాడుతారని, అయితే ఎన్నికల తరువాత మాత్రం వారు పంథా మారిపోతుందని ఆయన చురకలంటించారు. ప్రధాని నరేంద్రమోడీ సంపన్నుల పక్షపాతని విమర్శించిన రాహుల్.. వారి రుణాలను బేషరుతగా రద్దు చేయడానికి కూడా సిద్దమయ్యారని అరోపించారు. మోడీజీ నిజంగా రైతు పక్షపాతి అయితే రైతు రుణాలను బేషరతుగా రద్దు చేయాలని, రైతు కూలీలు, పేదలకు కూడా రుణాలను ఇప్పించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం గతంలో 70 వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రైతు సమస్యలపై తాను సంధించిన ప్రశ్నలకు ప్రధాని ఇప్పటి వరకు పార్లమెంటులో సమాధానాలు ఇవ్వలేదని చెప్పారు. ఈ సందర్భంగా రైతులతో మంచాలపై కూర్చోని చర్చించే కార్యక్రమాన్ని (ఖాట్ పె చర్చ)ను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం యూపీలోని రుద్రపూర్ గ్రామం నుంచి తనసుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు.తన మార్గంలో ప్రతి ఇంటినీ పలుకరిస్తూ ముందుకు సాగాలని రాహుల్ నిర్ణయించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  kisan yatra  deoria-delhi  congress  uttar pradesh  

Other Articles