pawan kalyan's publicly criticises media on caste editorials

Pawan kalyan questions media editorials on caste

Pawan Jana Sena Prasthanam meeting, caste editorials, Jana Sena public meeting in tirupati, Jana Sena Prasthanam meeting, Janasena Indira ground, pawan kalyan tirupathi meeting, pawan kalyan special status to AP

Actor turned politician Jana Sena chief Pawan Kalyan, raises questions on caste editorials

రెండు సార్లు టీడీపీ తప్పులను ఎత్తిచూపితే.. కులం గుర్తుకోచ్చిందా..?

Posted: 08/27/2016 05:28 PM IST
Pawan kalyan questions media editorials on caste

రాష్ట్రంలో టీడీపీ తప్పులను ఎత్తి చూపితే తనను కులరక్కసి చుట్టుముట్టిందని దినపత్రికల సంపాదకీయాలు రావడంపై సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే  తన చుట్టూ కులస్థులు చేరారనడం సబబా అని మీడియాను ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కోసం రాష్ట్రవ్యాప్తంగా అనేక సభల్లో పాల్గోన్నప్పుడు తన కులం ఏమాత్రం గుర్తుకు రానీ మీడియాకు.. టీడీపీని విమర్శించగానే కులం గుర్తుకు వస్తుందా..? అని ప్రశ్నించారు. తనకు అధికారం కావాలనో, లేక సీట్లు, ఓట్ల కోసమే తాను రాజకీయాలలోకి రాలేదని.. రాజకీయాల మీద, పదవుల మీద తనకు వ్యామోహం లేదని పవన్ అన్నారు.

తిరుపతిలో జనసేన బహిరంగ సభలో పాల్గొన్న పవన్ గుంటూరు శేషేంద్రశర్మ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించారు. తనకు దేశం మీద, సమాజం మీద వ్యధ ఉందన్నారు. నోటి నుంచి వచ్చిన మాట వెనక్కి తీసుకోలేమని...అందుకే ఆచితూచి మాట్లాడతానని చెప్పారు. ఒక దేశ సంపద యువతే అని పవన్ అన్నారు. వర్తమాన రాజకీయ నాయకులు యువతకు మేలు చేయలేకపోతే బాధగా ఉందని తెలిపారు. రెండు గంటల సినిమాలో ఏమైనా చేయవచ్చు...రౌడీలను కొట్టొచ్చు..హీరోయిన్లతో పాటలు పాడొచ్చు అని అన్నారు. అయితే నిజ జీవితంలో సమస్యలకు రెడీమేడ్‌ పరిష్కారం ఉండదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, మోదీ, నేను తిరుపతిలోనే తొలి సభ నిర్వహించాం...అందుకే ఇక్కడి నుంచే మాట్లాడాలని నిర్ణయించినట్లు పవన్ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pawan Kalyan  Jana Sena  Prasthanam  caste editorials  special status  Andhra pradesh  

Other Articles