హోదా కోసం మూడు దశల్లో జనసేన పోరాటం | pawan-announced-janasena-fight-on-ap-special-status

Pawan announced janasena fight on ap special status

pawan speech at Janasena meeting, pawan about special status, pawan on special status, Pawan kakinada sabha, Pawan Kakinada

pawan-announced-janasena-fight-on-ap-special-status.

ITEMVIDEOS:హోదా మన హక్కు... మూడు దశల్లో పోరాటం

Posted: 08/27/2016 05:39 PM IST
Pawan announced janasena fight on ap special status

ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా కాంగ్రెస్‌ పార్టీ విభజిస్తే అందుకు భాజపా సహకరించిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ధ్వజమెత్తారు. హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్‌ యువత ఎలా ముందుకు వెళ్తుందని, రాయితీలు ఇవ్వకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయని పవన్‌ ప్రశ్నించిన ఆయన కేంద్రం ఏం చేస్తుందో చూద్దామనే రెండేళ్లు వేచి చూశానని పవన్‌ తెలిపారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ కేంద్రానికి వినిపించేలా గళమెత్తాలని జనసేన నిర్ణయించిందని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన ప్రసంగంపై అసహనం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయనంత రాజకీయ అనుభవం తనకు లేదని, కానీ విభజన సమయంలో ఎలాంటి పోరాటం చేశారో అలాగే ప్రస్తుతం కొనసాగించాలన్నారు. జాతి ప్రయోజనాలు వెనక్కి నెట్టే విధంగ మాట్లాడుతూ తప్పు చేస్తున్నారని పవన్ తెలిపారు. ఈ సందర్భంగా అరుణ్ జైట్లీతోపాటు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రత్యేకంపై చేస్తున్న పోరును సహేతుకంగా లేదని తప్పుబట్టారు. కేంద్రమంత్రి పదవిలో ఉన్న అశోకగజపతిరాజు బయటికి వచ్చి పోరాడాలని సూచించారు. విభజనకు మూలకారకుడైన జైరామ్ రమేష్ ను ప్రత్యేకంగా ఏస్కున్నాడు. కేంద్రం ఇంకా తెలుగు ప్రజలకు అసహనం తెప్పించే కధలు చెప్పడం మానేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా తెలుగు ఎంపీలను ఉద్దేశించి మీకు సిగ్గులేదా? పార్లమెంటును స్థంభింపజేయండని అని కాస్త ఘాటు వ్యాఖ్యలే ఆయన చేశారు.

ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా రాష్ట్రాన్ని విడగొట్టి ఇప్పటి వరకు తమ రాష్ట్రానికి ఇచ్చింది కేవలం 16,500 కోట్లా? అని ఆయన ప్రశ్నించారు. ఇలా మీరు నిధులు ఇస్తే...ఏపీ ఏనాటికి ఒక పూర్తి స్థాయి రాష్ట్రంగా తయారవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ ఎప్పుడు జరుగుతాయని ఆయన చెప్పారు. అంకెల గారడీలు మానేయాలని ఆయన చెప్పారు. ఈ లెక్కలు తమకు చెప్పవద్దని ఆయన స్పష్టం చేశారు. అన్ని లెక్కలు కలిపితే 32 వేల కోట్లు ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.

 

‘ప్రత్యేకహోదా కావాలంటూ మన ఎంపీలు ఢిల్లీలో తెలుగులో అడుగుతుంటే హిందీ మాత్రమే తెలిసిన కేంద్రానికి అర్థం కావడం లేదనీ, మన ఆవేదన వారికి సరిగా చేరడం లేదంటూ’ తెలుగు, హిందీ, ఇంగ్లీషులో తెలుగువారి ఆవేదనను కేంద్రానికి అర్థమయ్యే రీతిలో తెలిపారు. మొదట తెలుగులో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ చెప్పి.. ఆ తర్వాత హిందీలో లడేంగే లడేంగే.. జీతేతక్ లడేంగే.. (పోరాడదాం.. పోరాడదాం.. సాధించే వరకూ పోరాడదాం) అంటూ పిలుపునిచ్చారు. అనంతరం ఇంగ్లీషులో మాట్లాడారు. ‘మా బాధను, కన్నీళ్లను అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు కాబట్టి మా బాధ అర్థం కావడంలేదేమో’ అంటూ ఇంగ్లీషులో ప్రసంగించారు. ప్రత్యేక హోదా మన హక్కు... తెలుగు వారి ఆత్మగౌరవం నిలబడాలంటే హోదా సాధించాల్సిందేనని పిలుపునిచ్చాడు.

హోదా కోసం జనసేన మూడు దశల్లో పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

తొలిదశ: ప్రత్యేక హోదా కోసం తొలిదశలో ప్రతీ మండలానికి వెళ్లి మనకు జరిగిన అన్యాయం ఏమిటి? ప్రత్యేకహోదా కోసం జనసేన ఏం చేయబోతోందో అనేది ప్రజలకు వివరిస్తాం. ఎక్కడైతే రాష్ట్రాన్ని విడకొట్టాలని నిర్ణయించారో ఆ కాకినాడ వేదికగానే తొలి సభ నిర్వహిస్తాం.

రెండో దశ: రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికార ఎంపీల మీద, ప్రతిపక్ష పార్టీ ఎంపీల మీద భాజాపా ఎంపీల మీద ఒత్తిడి తీసుకొచ్చేలా కొన్నివిధానాలు ఆవలంభిస్తాం.

తుదిదశ: ఎంపీలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇక మూడోదశను తీసుకొస్తాం. ప్రజల సహకారంతో వారి ఆలోచనలు తీసుకుని, రోడ్లపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడతాం.

పోరాటంలో భాగంగా తన తొలిఅడుగు బీజేపీ ఎక్కడైతే రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించిందో అదే కాకినాడ నడి బొడ్డు నుంచి ప్రారంభమవుతుందని, సెప్టెంబర్ 9న సభ నిర్వహించబోతున్నట్లు ప్రకటించి చివర్లో జైహింద్ అంటూ సభను వీడారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles