కులం, మతం అంటగట్టకండి తిరుపతిలో పవన్ | pawan about caste feeling at tirupathi sabha

Pawan about caste feeling at tirupathi sabha

pawan about caste at tirupathi sabha, pawan speech at Tirupathi Sabha, Pawan Kalyan at Tirupathi Sabha

pawan about caste feeling at tirupathi sabha.

పవన్ ప్రసంగం4: నాకు కులం, మతం అంటగట్టకండి

Posted: 08/27/2016 05:22 PM IST
Pawan about caste feeling at tirupathi sabha

తాను సమస్యలు చూసి పారిపోయే వ్యక్తిని కాదని, నిజమైన సమస్య వస్తే నిలబడే వ్యక్తినని పవన్ చెప్పుకొచ్చాడు. అమరావతి రైతు సమస్యల విషయంలో వారి పక్షాన నిలబడే ప్రయత్నం చేశానని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో టీడీపీ కూడా తనకు సహకరించిందని ఆయన చెప్పారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ, బీజేపీకి తనదైన సహాయం చేశానని ఆయన గుర్తు చేశారు. తాను చేసింది ఉడత సాయమా? 90 శాతమా? అన్నది పక్కన పెడితే, చాలా మంది సహాయం చేశారని ఆయన చెప్పారు. ఇక తాను రిస్క్ చేసి రాజకీయాల్లోకి వస్తే, తమ పనులు మానేసి కొందరు తనపై విమర్శలు చేయడానికి ప్రాధాన్యతినిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల్లో ఉంటే ప్రజలకు అన్యాయం జరగకూడదని తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు. ఆ సమయంలో తాను టీడీపీ, బీజేపీలకు మద్దతు తెలిపితే తనను, జనసేన కార్యకర్తలను చాలా మంది పొగిడారని ఆయన అన్నారు. ఆ తరువాత 'ప్రశ్నిస్తా'నని అనగానే తన చుట్టూ ఉన్నవారంతా తన కులం వాళ్లేనని అనడం మొదలు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభకు వచ్చిన ఇంత మంది అభిమానులది ఏ కులమో? ఏ మతమో? తనకు ఎలా తెలుస్తుందని ఆయన నిలదీశారు. తాను గతంలో టీడీపీ విధి విధానాలను రెండుసార్లే అడిగానని ఆయన గుర్తు చేసుకున్నారు.

తనను ప్రతి పార్టీవారు కులం పేరుతో విమర్శలు చేయడం మొదలు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాకు కులమెక్కడుంది? అలాగే నాకు మతం ఎక్కడుంది? అని ఆయన ప్రశ్నించారు. తన కడుపున పుట్టిన కూతురు క్రిష్టియన్ అని, ఆమె రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్ లో బాప్టిజం తీసుకుందని ఆయన తెలిపారు. తాను హిందువునని, అలాంటప్పుడు తనకు మతాల భేదం ఎక్కడుందని ఆయన చెప్పారు. తనకు కుల మతాలు అంటగడితే అరికాలి నుంచి నషాళానికి మంట ఎక్కుతుందని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Tirupathi  Sabha  

Other Articles