15-year old Jhanvi Behal, who challenged Hafiz Saeed, stopped from unfurling Tricolour in Jammu and Kashmir

Ludhiana girl stopped from unfurling tricolour at srinagar s lal chowk

ludhiana girl, Jhanvi Behal, girl ludhiana, independence day, unfurling Tricolour, Jammu and Kashmir, indian flag at lal chowk, independence day news, latest news, india news

At a time when the entire country is celebrating 7oth Independence Day hoisting national flag with pride, Jammu and Kashmir police stopped a 15-year old girl from Ludhiana to unfurl Tricolour at Lal Chowk in Srinagar.

నీరుగారిన లుధియానా సాహస బాలిక ఉత్సాహం..

Posted: 08/15/2016 06:50 AM IST
Ludhiana girl stopped from unfurling tricolour at srinagar s lal chowk

దేశంలో భాగమైన జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో వేర్పాటు వాదులు జాతి పతాకాన్ని అవమానపరుస్తున్న నేపథ్యంలో అక్కడే త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి.. దేశభక్తి చాటుతానని ప్రతీనబూనిన లుధియానా బాలిక జాన్వీ బెహల్ (15)కు చుక్కెదురైంది. అమెలో వున్న దేశభక్తి కాస్త పోలీసుల అడ్డుకోవడంతో నీరుగారిపోయింది. శ్రీనగర్ కు చేరుకున్న ఆమెను, ఆమె మద్దతుదారులను భద్రతాదళాలు ఎయిర్ పోర్టులోనే నిలువరించాయి. లాల్ చౌక్ లో జెండా ఎగురవేయాలన్న ఆమె ప్రయత్నాన్ని వేర్పాటువాదులు అడ్డుకునే అవకాశం ఉండటంతో వారిని ఎయిర్ పోర్టు నుంచి తిప్పి పంపించారు.

దీంతో జాన్వీ భారత అనుకూల నినాదాలు చేస్తూ శ్రీనగర్ నుంచి వెనుదిరిగారు. జాతి వ్యతిరేక నినాదాల విషయంలో జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ కు సవాలు విసరడం ద్వారా జాన్వీ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. జాతి వ్యతిరేక నినాదాల విషయంలో కన్హయ్యకుమార్ కు దమ్ముంటే తనతో చర్చకు రావాలని ఆమె సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఎగురవేసి తన దేశభక్తిని చాటుకోవాలని జాన్వీ భావించారు. అయితే, తన మిషన్ పూర్తికాకపోవడం నిరాశను కలిగించిందని జాన్వీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ludhiana girl  Srinagar  lal chowk  Jhanvi Behal  Jammu and Kashmir  

Other Articles