New York’s JFK Airport evacuated after reports of gunfire

Police respond to jfk airport reports of man with a gun

new york, new york shooting, new york airport, jfk airport shooting, john f kennedy airport, new york airport shooting, new york airport shots, jfk airport, john f kennedy airport shooting, world news, latest news, breaking news

John F Kennedy Airport shooting: According to preliminary investigation, no evidence of shots being fired have been found, says Port Authority.

ITEMVIDEOS: న్యూయార్క్ విమానాశ్రయంలో కాల్పుల కలకలం..

Posted: 08/15/2016 07:35 AM IST
Police respond to jfk airport reports of man with a gun

న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాల్పుల కలకలం రేగింది. ఎయిర్ పోర్టు ప్రధాన టెర్మినల్ ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించడంతో భద్రతాసిబ్బంది గేట్టు మూసేసినట్లు ప్రధాన సాక్షులు చెప్తున్నారు. విమానాశ్రయంలోని ఉద్యోగులు, ప్రయాణీకులు ఎవ్వర్నీ బయటకు పోనీకుండా తలుపులు మూసివేసినట్లుగా సాక్షులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆదివారం రాత్రి భయోత్పాతాన్ని సృష్టించిన షూటర్లను పట్టుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది గేట్లు మూసివేశారంటూ డాన్ ఆర్చర్ అనే వ్యక్తి ట్వీట్ చేయడంతో కాల్పుల వార్త.. వెలుగులోకి వచ్చింది.

సోషల్ మీడియాద్వారా  కాల్పుల వార్త  వ్యాపించడంతో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ విమానాశ్రయం వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపింది. అయితే  ఎన్ వై పిడి మాత్రం కాల్పుల విషయాన్ని ధృవీకరించలేదని అసోసియేటెడ్ ప్రెస్ నివేదికలను చెప్తున్నాయి. ఎయిర్ పోర్టులో కాల్పులకు సంబంధించిన ఎటువంటి సమాచారం అందుబాటులో లేనట్లు చెబుతోంది. మరోవైపు న్యూయార్క్ విమానాశ్రయం అధికారిక ట్విట్టర్ ఖాతాలో మాత్రం... వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని విమానాలు ఆలస్యంగా బయల్దేరుతున్నట్లు ట్వీట్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gunfire was reported  John F Kennedy International Airport  New York  

Other Articles