Fresh trouble brews for Vijay Mallya; CBI registers cheating case

Cbi files fresh fir against vijay mallya

Vijay Mallya, CBI, Loan default case, SBI, United Breweries, bank loans, Rs 1.64 Crore, Payment, CBI, Loan default case, SBI, United Breweries Holdings Limited,UBHL,State Bank Of India,Kingfisher Airlines

A fresh case has been filed against industrialist Vijay Mallya for alleged irregularities in repayment of Rs 1,600 crore loan taken from State Bank of India

మాల్యాకు దెబ్బ మీద దెబ్బ.. అటు మరో కేసు.. ఇటు అగిన నగదు..

Posted: 08/13/2016 08:25 PM IST
Cbi files fresh fir against vijay mallya

వేలకోట్ల ప్రజల సోమ్మును రుణాలుగా పోంది.. ఉద్దేశపూర్వకంగా వాటిని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన అర్థిక నేరస్థుడు, లిక్కర్ కింగ్ యూబీఎల్  ఛైర్మన్ విజయ్ మాల్యాకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. మాల్యా రుణంగా పోందిన డబ్బును వడ్డీతో సహా చెల్లించాల్సిందిగా కోరుతూ బ్యాంకుల కన్సార్టియం సుప్రీంను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న సీబీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ డిఫాల్ట్ కేసులో విజయ్ మాల్యాపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 420 ప్రకారం సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది.

ఈ కేసులో మాల్యా దోషిగా నిర్ధారణ అయితే సుమారు ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతోపాటు వివిధ నేరాల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) సహా వివిధ సంస్థలు మాల్యాపై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలావుండగానే యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ కంపెనీ కూడా మాల్యాకు ఝలకిచ్చింది. మాల్యా పేరును  స్పష్టంగా పేర్కొనని కంపెనీ  స్టాక్ ఎక్స్చేంజ్  ఫైలింగ్ లో  రూ.1.64 కోట్ల రూపాయల  చెల్లింపులను నిలిపివేసినట్టు తెలిపింది.  

టీడీఎస్ శాఖ ఆదేశాల కనుగుణంగా చెల్లింపులను నిలిపి వేసినట్టు పేర్కొంది. మాల్యాపై కింగ్ ఫిషర్  ఎయిర్ లైన్స్  కేసు  విచారణ నడుస్తున్న కారణంగా  రూ.1.64 కోట్ల రూపాయల చెల్లింపును నిలిపివేసినట్టు  చెప్పింది. ఈ మేరకు  ఆదాయ పన్ను శాఖ కమిషనర్ నుంచి తమకు లేఖ అందిందని కంపెనీ తెలిపింది. జీతం, వేతనం, భత్యాలు తదితర  చెల్లింపులను  నిషేధిస్తూ జారీ చేసిన ఆర్డర్  జూన్ 28, 2016 న తమకు అందిందని కంపెనీ తెలిపింది. అయితే దీనిపై స్పందించడానికి కంపెనీ ప్రతినిధి తిరస్కరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : United Breweries  bank loans  Rs 1.64 Crore  Payment  Vijay Mallya  CBI  Loan default case  SBI  

Other Articles