Caught on CCTV, woman doctor removed IV line for father

Jayasudha murdered her father by removed iv line caught on cctv

Woman Doctor Removed IV Line, Woman doctor kills father, woman doctor, Chennai hospital, daughter kills father, father, daughter, grand children, doctors, documents, IV Fluid, jayasudha, chennai

As her old, frail father lay in the ICU of a Chennai hospital, his daughter a doctor, is recorded on security cameras entering the room. Then she pulls out the intravenous drip injecting crucial medicines directly into his veins.

ITEMVIDEOS: తండ్రిని హతమార్చిన జయసుథ.. బయటపెట్టిన సీసీటీవీ

Posted: 08/13/2016 06:15 PM IST
Jayasudha murdered her father by removed iv line caught on cctv

మానవ సంబంధాలన్నీ ధనం చుట్టూ తిరిగేవేనని పెద్దలు చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక.. ఏ దారెటుపోతుందో ఎవరినీ అడగక అన్నట్లు కనిపెంచిన తండ్రి అనారోగ్యంతో మంచానపడితే.. అప్యాయంగా దెగ్గరకు చేరి ఆయన మేమున్నామని ధైర్యం చెప్పాల్సిన ఆత్మీయులు.. అందులోనూ కూతురు.. ఆస్తి కోసం కన్న తండ్రినే హతమార్చేందుకు యత్నించింది. వైద్యుడైన వృద్ద తండ్రి అనారోగ్యంతో అస్పత్రిలో చేరగా.. వైద్యురాలైన కూతరు స్వయంగా హతమార్చేందుకు యత్నించిన ఘటన చెన్నైలో జరిగింది.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బయటపడ్డాయి. చెన్నైకి చెందిన డాక్టర్ రాజగోపాల్ (82) కుమారుడు జయప్రకాష్ కూడా వైద్యుడే. కీల్ పాక్ లో ఆదిత్యా ఆసుపత్రిని జయప్రకాష్ నిర్వహిస్తున్నాడు. అనారోగ్యం బారినపడ్డ తండ్రిని తన ఆసుపత్రిలోని ఐసీయూలో ఉంచి ఆయన చికిత్స అందిస్తున్నాడు. ఇక, రాజగోపాల్ కుమార్తె, జయప్రకాష్ సోదరి అయిన జయసుధ కూడా వైద్యురాలే!

ఆమధ్య ఒకరోజున తన తండ్రిని చూసేందుకని జయసుధ, ఆమె భర్త మనోహరన్, కొడుకు డాక్టర్ హరిప్రసాద్ లతో కలిసి ఈ ఆసుపత్రికి వచ్చింది. తన తండ్రితో మాట్లాడే పని ఉందని చెప్పి, అక్కడి నుంచి కొంచెం సేపు బయటకు వెళ్లాలని నర్సులకు చెప్పడంతో వారు బయటకు వెళ్లిపోయారు. వెంటనే, తన తండ్రి వద్దకు వెళ్లిన జయసుధ, తమ వెంట తెచ్చుకున్న ఆస్తి పత్రాలపై సంతకం చేయాలని ఆయన్ని కోరింది. అందుకు నిరాకరించిన తండ్రితో బలవం తంగా ఆయన వేలిముద్రలు వేయించుకుంది.

ఆ తర్వాత ఆయన శ్వాస తీసుకుంటున్న ఆక్సిజన్ మాస్క్ ను తొలగించడంతో పాటు, ఆయనకు పెట్టి ఉన్న సెలైన్ ట్యూబ్ ను కూడా కత్తిరించివేశారు. ఆ తర్వాత నర్సులు లోపలికి రావడంతో వారు ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపో యారు. అయితే, ఈ సంఘటన అనంతరం రాజగోపాల్ ఆరోగ్యం మరింతగా క్షీణించి గత నవంబర్ 2న ఆయన మరణించారు. తన తండ్రి ప్రాణాలు పోవడానికి తన సోదరి చేసిన పనే కారణమని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తెలుసుకున్న కొడుకు జయప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. బలవంతంగా ప్రాణాలు తీసి, వైద్య వృత్తికి ద్రోహం చేసిన తన సోదరి, బావ, మేనల్లుడు ఆ వృత్తికి అనర్హులంటూ, వారి రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని కోరుతూ డాక్టర్ జయప్రకాష్ మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : father  daughter  grand children  doctors  documents  IV Fluid  jayasudha  chennai  

Other Articles