పార్టీ ఎమ్మెల్యేల వరుస అరెస్టులతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నరే పాలనాధిపతి అని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. మంత్రి మండలి సలహా మేరకే లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) వ్యవహరించాల్సి ఉంటుందన్న ఆప్ ప్రభుత్వ వాదన అర్థం లేనిదని, ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని 194 పేజీల తీర్పులో స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కేంద్రంతోనూ ఢీ అంటే ఢీ అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. పాలనాపగ్గాల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో కొన్ని నెలల నుంచి వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే... ఢిల్లీలో ఉన్నతాధికారుల నియామకాల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు పూర్తిస్థాయి అధికారాలు కల్పిస్తూ కేంద్రం గతేడాది నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. చీఫ్ జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ జయంతనాథ్‌తో కూడిన బెంచ్ గురువారం తీర్పు చెప్తూ... కేజ్రీవాల్ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది.
ఆప్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను ఢిల్లీ హైకోర్టు తూర్పారబట్టింది. కేంద్ర ఉద్యోగులను ఢిల్లీ ప్రభుత్వ ఏసీబీ అధికారులు విచారించడానికి వీల్లేదని కేంద్రం గతేడాది మే 21న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆప్ ప్రభుత్వం దీన్ని సవాలు చేయగా... ఈ నోటిఫికేషన్ ఎంతమాత్రమూ చట్టవిరుద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. సర్వీసుకు సంబంధించిన విషయాలు ఢిల్లీ అసెంబ్లీ పరిధిలోకి రావని, ఇలాంటి విషయాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ తన అధికారాలను ఉపయోగించుకోవడం రాజ్యాంగవిరుద్ధం కాదని కోర్టు చెప్పింది. సీఎన్‌జీ ఫిట్‌నెస్ స్కాం, ఢిల్లీ అండ్ డిస్ర్టిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) స్కాములపై విచారణ కమిషన్‌ను నియమిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం చట్టవిరుద్ధమని కోర్టు ప్రకటించింది.
లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయం తెలుసుకోకుండా, సమ్మతి లేకుండానే సీఎం సిఫారసు మేరకు బీఎ్‌సఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, బీఎ్‌సఈఎస్ యమునా పవర్ లిమిటెడ్, టాటా పవర్ ఢిల్లీ డిస్ర్టిబ్యూషన్ లిమిటెడ్‌లలో ప్రభుత్వ ప్రతినిధులను ఢిల్లీ పవర్ కంపెనీ లిమిటెడ్ నియమించడం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీకి సంబంధించి రాజ్యాంగం(ఆర్టికల్ 239ఏఏ)లో ప్రస్తావించిన ప్రత్యేక నిబంధనలతో సహా మొత్తం 9 అంశాలపై మే నెలలోనే వాదనలు పూర్తయ్యాయి. ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్రం కాదుకాబట్టి అది తమ నియంత్రణలోనే ఉంటుందని కేంద్రం వాదించగా.... ప్రజాస్వామ్య వ్యవస్థలో లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి అంటూ రెండు ప్రభుత్వ వ్యవస్థలు వాంఛనీయం కాదని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more