మరికొన్ని గంటల్లో ఒలంపిక్స్ కు సర్వం సిద్ధం | Rio Olympics 2016 31st Games set for opening ceremony

Rio olympics 2016 31st games set for opening ceremony

Rio Olympics 2016, 31st Rio Olympics, India in Rio Olympics, India in opening ceremony, India in Rio Olympics ceremony, Rio Olympics 2016, Rio Olympics opening ceremony, India team in Rio Olympics

Rio Olympics 2016 31st Games set for opening ceremony.

విశ్వక్రీడలకు సర్వం సిద్ధం... ఆశలన్నీ ఆ వంద మంది మీదే!

Posted: 08/05/2016 09:07 AM IST
Rio olympics 2016 31st games set for opening ceremony

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రీడా కుంభమేళా ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమైంది. బ్రెజిల్ లోని రియో డి జెనిరీ వేదికగా మరికొన్ని గంటల్లో ఆరంభ వేడుకలతో సమరానికి శంఖం పూరించనున్నారు. మరకానా స్టేడియంలో జరగబోయే 31వ ఒలంపిక్స్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఇది జరుగుతోంది. ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఒలింపిక్ జ్యోతిని వెలిగించి ఆరంభించే ఈ వేడుకలు దాదాపు మూడున్నర గంటలపాటు సాగుతాయి. ఆరువేలమందితో సాగే నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు చెబుతున్నారు.

ఏర్పాట్లు:
దక్షిణ అమెరికా ఖండంలో జరుగుతున్న తొలి ఒలింపిక్ క్రీడలు ఇవే కావడంతో ఘనంగా నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 5 నుంచి 21 వరకు సాగే ఈ విశ్వక్రీడా సంరంభంలో 206 దేశాలకు చెందిన 10,500 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. 28 క్రీడల్లో 306 పతక ఈవెంట్లలో పోటీలు జరగనున్నాయి. పురుషులకు 161 విభాగాల్లో పోటీలు ఉండగా మహిళలకు 136 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇద్దరికీ కలిపి 8 ఈవెంట్లు జరుగుతాయి. క్రీడలు తిలకించే వారికోసం 75 లక్షల టికెట్లు విక్రయించారు. వీటిని తిలకించేందుకు 5 లక్షల మంది పర్యాటకులు రియో వస్తారని అంచనా వేస్తున్నారు. ఆరంభ, ముగింపు వేడుకలు ఆతిథ్యం ఇవ్వనున్న మరకానా స్టేడియం సామర్థ్యం 78వేలు. వాటి కోసం ఇప్పటికే టికెట్ల విక్రయం జరిగిపోయింది. ఇక రియో ఒలింపిక్స్ నిర్వహణకు మొత్తంగా రూ. 77.237 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఒలింపిక్స్ క్రీడల టీవీ ప్రసార హక్కుల కోసం ఎన్బీసీ యూనివర్సల్ దాదాపు రూ. 8వేల కోట్లు చెల్లించింది.

డ్రగ్స్ మాఫియా, జికా వైరస్, దోపిడీలు రియో క్రీడాగ్రామంలో ఒక్కసారిగా పెరిగినట్టు ఇటీవల వరుసగా వార్తలు వెలువడ్డాయి. అయితే క్రీడలు ప్రారంభమయ్యాక ఇవన్నీ సమసిపోతాయని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. వీటిని అరికట్టేందుకు భారీగా భద్రతా దళాలను మోహరించింది. అటు క్రీడాకారులకు, ఇటు అభిమానులకు, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది.

భారత్ తరపున:

ఒలింపిక్స్‌లో వందమందికిపైగా భారత క్రీడాకారులు పాల్గొనడం ఇదే తొలిసారి. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 81 ఒక్కమంది క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత్ ఆరు పతకాలు సాధించగా, ఈసారి మాత్రం 118 మంది క్రీడాకారులతో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. విశ్వక్రీడల్లో భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని అందించిన షూటర్ అభివన్ బింద్రా ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత జెండా చేబూని క్రీడాకారుల బృందాన్ని లీడ్ చేయనున్నాడు. ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఈ అతి పెద్ద క్రీడా సంబరంలో ఎక్కువ పతకాలు సాధించి ఆటగాళ్లు మన దేశ జెండాను సగర్వంగా ఎగరేయాలి ఆశిస్తూ... వారికి ఆల్ ది బెస్ట్ చెబుదాం.

 

India in Rio Olympics

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rio Olympics  2016  India  opening ceremony  

Other Articles