AAP MP Bhagwant Mann sparks security scare with 'educational video' of Parliament

Bhagwant mann says will apologise in lok sabha for parliament video

Bhagwant Mann video, parliament rukus, Harsimrat Badal, muktar abbas naqvi, sitaram yechury, AAP, Bhagwant Mann, Parliament

Aam Admi Party leader Bhagwant Mann's video on security checks in Parliament posted on his Facebook account rocked both houses of the Parliament.

పార్లమెంటును కుదిపేసిన అప్ ఎంపీ ఫేస్ బుక్ వీడియో..

Posted: 07/22/2016 01:04 PM IST
Bhagwant mann says will apologise in lok sabha for parliament video

పంజాబ్‌కు చెందిన ఆప్ ఎంపీ భగవంత్‌ మాన్‌సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. పార్లమెంట్ భద్రతకు సంబంధించి ఆయన షూట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యవహారంపై పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని అధికార బీజేపీ, అకాలీదళ్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో ఉభయసభల్లోనూ గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. సభా కార్యక్రమాలు స్తంభించిపోయాయి.

పార్టీలకతీతంగా ఎంపీలంతా ఆయనపై విరుచుకుపడుతున్నారు. భగవంత్ మాన్ తీసిన వీడియో తీవ్రవాదుల చేతుల్లో పడితే ఎవరు బాధ్యత వహిస్తారని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి, హరసిమ్రత్ బాదల్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తప్పనిసరిగా దర్యాప్తు జరిపించాలని, పార్లమెంట్ కార్యకలాపాలను వీడియో తీయడం వెనుకున్న ఉద్దేశాన్ని వెల్లడి చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి స్టింగ్ ఆపరేషన్ దారుణమని... ప్రజాసామ్యానికి టెంపుల్ లాంటి పార్లమెంట్ భద్రతపై స్టింగ్ ఆపరేషన్ చేయడమేంటని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య, జాతి భద్రత దృష్ట్యా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన నిబంధనలను ఉల్లంఘించడమే కాదు, ఆ పని మళ్లీ మళ్లీ చేస్తానంటున్నారని నిర్మలాసీతారామన్ అన్నారు.
 
పార్లమెంట్ భద్రత వ్యవహారాన్ని వీడియోలు తీయడం దారుణమని సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి మండిపడ్డారు. ఇది భద్రత నియమాలను ఉల్లంఘించడమే కాదు, సభ్యుల హక్కుల ఉల్లంఘన కిందకు కూడా వస్తుందని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న ఆయన అసలు ఎందుకు ఆలస్యం జరుగుతుందని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు కూడా కేంద్రం ఆధీనంలోనే ఉంటారు కదా అని సీతారాం ఏచూరి అన్నారు.

మరోవైపు స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎదుట హాజరై భగవంత్ వివరణ ఇచ్చారు. జీవో అవర్ లో విపక్షాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు చూపించేందుకే వీడియో తీశానని భగవంత్ చెప్పారు. అంతేకాని పార్లమెంటులో భద్రతపై తాను వీడియోను షూట్ చేయలేదని చెప్పుకోచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చలు లక్కీ డ్రా మాదిరిగా జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ భద్రతకు భంగం కలిగించలేదన్నారు. జీవో అవర్ లో చేసిన వీడియోను ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం పార్లమెంటులో పెద్ద దుమారాన్నే లేపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles