SC to hear plea for Governor's rule in Jammu and kashmir

Sc to hear plea for governor s rule in j k

Supreme Court, president rule, governor rule in J&K, imposition of Governor's rule, provision of J&K constitution, failure of law and order, chie justice TS Thakur, JKNPP, interest of security, safety, citizens fundamental rights

Supreme Court agreed to hear a plea seeking imposition of Governor's rule in Jammu & Kashmir, under a provision of J&K Constitution, due to the prevailing law and order situation in the state

కాశ్మీర్ల్ లో రాష్ట్రపతి పాలన..

Posted: 07/22/2016 04:33 PM IST
Sc to hear plea for governor s rule in j k

కాశ్మీర్ లోయలో ఇంకా అందోళనలు చల్లారలేదు. పక్షం రోజులుగా కాశ్మీర్ లోయలో సామాన్యులు భయాందోళన గుప్పిట్లోనే వున్నారు. జనజీవనం స్థంభించిడంతో.. నిద్రాహారాలకు దూరమై ప్రజలను అనేక ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లో చెలరేగిన ఆందోళనలతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో, పస్తులుండాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించి.. ప్రజల ఇబ్బందులను దూరం చేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. దానిని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడం చర్చనీయాంశంగా మారింది.

జమ్ముకశ్మీర్ లో భద్రతా బలగాల హెచ్చుమీరి ప్రవర్తిస్తున్నాయని, నిరంకుశంగా ప్రజలను అణచివేస్తున్నాయని, వాటిని అరకట్టేందుకు జమ్ముకశ్మీర్ రాజ్యాంగం సెక్షన్ 92ను అనుసరించి రాష్ట్రంలో రాష్రపతి పాలన విధించాలని జమ్ముకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (జేకేఎన్పీపీ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసం ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. వచ్చేవారం వాదనలు జరగనున్నాయి. గడిచిన రెండు వారాలుగా రాష్ట్రంలో కొనసాగుతోన్న ఆందోళనలను అదుపుచేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్న పిటిషనర్లు.. ముఫ్తీ సర్కారును రద్దుచేసేలా గవర్నర్ కు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టును కోరారు.

కాగా, పరిష్కారం కోసం హైకోర్టుకు వెళ్లకుండా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారు? అని ధర్మాసనం ప్రశ్నించింది. కొద్దిరోజులుగా జమ్ముకశ్మీర్ హైకోర్టులో కార్యకలాపాలు కూడా స్థంభించిపోయాయని, ప్రజలు ఇళ్లను కూడా బయటకు రాలేని పరిస్థితులు నెకొన్నాయని, దీంతోనే తాము అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు చెప్పారు. పక్షం రోజులుగా కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా లేని దుర్భర పరిస్థిుతుల్లో ప్రజలున్నారని, దేశ ప్రజల భద్రత, రక్షణ, వారి రాజ్యంగం కల్పించిన హక్కుల కాపాడేందుకు జమ్మూకాశ్మీర్ రాజ్యాంగం లోనీ 92 సెక్షన్ కింద న్యాయస్థానం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం కశ్వీర్ లోయలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Plea  president Rule  Jammu and Kashmir  JKNPP  

Other Articles