Khaleda Zia's son sentenced to seven years for money laundering

Former prime minister son convicted in money laundering case

Tarique Rahman, khaleda zia son, khaleda zia, bangladesh, khaleda zia corruption, bangladesh zia corruption, zia money laundering

BNP Chairperson Khaleda Zia has met the senior leaders of her party after the High Court found her son Tarique Rahman guilty of laundering money when she was the prime minister.

మాజీ ప్రధాని తనయుడికి ఏడేళ్ల జైలు శిక్ష

Posted: 07/22/2016 11:57 AM IST
Former prime minister son convicted in money laundering case

ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని ఖలీదా జియా తనయుడికి హైకోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. హైకోర్టు తీర్పుతో ఖంగుతిన్న ఖలీదా జియా తన పార్టీ సీనియర్ నేతలను, సలహాదారులతో నిన్న రాత్రి సమావేశమై భవిష్యత్ కార్యచరణపై సమాలోచనలు జరిపారు. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అద్యక్షురాలు ఖలిదా జియా పెద్ద కుమారుడు తారిఖ్ రెహమాన్‌కు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రహమాన్ తన రాజకీయ వారుసుడని ఇప్పటికే ప్రకటించిన ఖలీదా జియా హైకోర్టు తీర్సు మింగుడు పడటం లేదు. దీంతో అమె అత్యవసరంగా పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరిపారు.

తారిఖ్ రెహమాన్‌(48)కు 2.5మిలియన్‌ అమెరికా డాలర్ల మనీలాండరింగ్‌ కేసులో హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. కింది కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ 2013లో వెలువరించిన తీర్పును తోసిపుచ్చింది. బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అయిన తారిఖ్‌పై 2003 నుంచి 2007 వరకు అధికారంలో ఉన్న సమయంలో అధిక మొత్తంలో డబ్బు సింగపూర్‌కు మళ్లించినట్లు ఆరోపణలు రుజువటంతో న్యాయస్థానం ఏడేళ్ళ జైలుశిక్షను విధించింది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ అద్యక్షురాలు ఖలీదా జియాతో పాటు సీనియర్ నేతలు సమావేశమై భవిష్యత్ కార్యచరణను చర్చించారు. హైకోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాలను అశ్రయించడంతో పాటు ఎలాంటి న్యాయపర చర్యలను తీసుకోవాలన్న విషయం తాము చర్చించామని ఆ పార్టీ సినియర్ సంయుక్త కార్యదర్శి రుహుల్ కబీర్ రిజ్వి తెలిపారు. దీంతో పాటు హైకోర్టు తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్ లో ఎదురయ్యే పరిస్థితులపై కూడా తాము చర్చిస్తున్నామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tarique Rahman  khaleda zia  bangladesh national party  money laundering case  

Other Articles