Pema Khandu Govt Passes Floor Test With 46 MLAs Voting In Favour

Pema khandu government passes floor test in arunchal assembly

Pema Khandu, Arunachalpradesh, late Chief Minister Dorjee Khandu, Chief Minister, Governor Tathagata Roy, Nabam Tuki, deputy cm, deputy chief minister, ap, floor test, BJP, Congress, Chowna Mein

Pema Khandu Government passed the Floor Test in assembly with 46 MLAs voting in favour of CM while 11 members from opposition BJP voted against it in 60-member House.

దేశంలోనే పిన్న వయస్పు ముఖ్యమంత్రి.. విశ్వాసపరీక్ష నెగ్గారు..

Posted: 07/20/2016 02:49 PM IST
Pema khandu government passes floor test in arunchal assembly

అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం బలం నిరూపించుకుంది. కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమా ఖండూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతికించారు. ఇవాళ నిర్వహించిన విశ్వాస పరీక్ష కాంగ్రెస్ శాసనసభ్యులు అయనకు అండగా నిలవడంతో తన ప్రభుత్వాన్ని బలపరీక్షలో గెలిపించుకున్నారు.  ఇవాళ నిర్వహించిన విశ్వాస పరీక్షలో ఆయనకు అనుకూలంగా 46 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. అయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా 11 మంది బీజేపి ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దీంతో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకుని ప్రభుత్వాన్ని కోనసాగించనుంది.

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అరుణాచల్ ప్రదేశ్ లో విధించిన రాష్ట్రపతి పాలను రద్దు చేస్తూ అదేశాలిచ్చింది. ఉత్తరాఖండ్ తరువాత అరుణాచల్ ప్రదేశ్ లో కేంద్రం రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసినా.. వాటిని ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలు అడ్డుకుని న్యాయస్థానాన్ని అశ్రయించడంతో సుప్రీంకోర్టు రాష్ట్రపతి పాలనను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యంగబద్దంగా వుండే ప్రభుత్వాలను కోనసాగించాలని అదేశించింది.

అయితే కాంగ్రెస్ లో వచ్చిన అంతర్గత రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అప్పటి వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నబం టుకీ కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతో పదవికి రాజీనామా చేశారు. దీంతో విమాన ప్రమాదంలో స్వర్గస్థులైన ముఖ్యమంత్రి దూర్జి ఖండూ కుమారుడు పెమా ఖండూ అరుణాచల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దేశంలోనే అత్యంత పిన్నవయస్సులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా పెమా ఖండూ రికార్డు నెలకొల్పారు. గత ఆదివారం రాజధాని ఈటానగర్ లో ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. ఇవాళ జరిగిన విశ్వాస పరీక్షలోనూ నెగ్గుకు వచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pema Khandu  Arunachalpradesh  Chief Minister  andhra pradesh  BJP  Congress  

Other Articles