Three Indigenous ‘Dhanush’ Artillery Guns Handed Over To Indian Army

Three indigenous dhanush artillery guns handed over to indian army

India army, Ordnance factory board, Dhanush, Artillery gun, Bofors, Indian forces, manohar parikar, ak antony, howtizers, kolkata ordinance factory

Three 155 mm howitzers (Dhanush) have been handed over to the indian army recently for user's trial, which have been sucessful.

భారత సైన్యం చేతికి అదునాతన ధనుష్ తుపాకులు

Posted: 07/19/2016 01:19 PM IST
Three indigenous dhanush artillery guns handed over to indian army

భారత సైనికులకు అధునాతన ఆయుధాలను అందించేందుకు కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎంతో అవసరమైన శతృఘ్న తుపాకులను కూడా కొనుక్కోలేని నిస్సహాయ స్థితిలోకి చేరిన దేశ రక్షణ శాఖలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ పగ్గాలను చేపట్టిన తరువాత  మార్పులు తీసుకువచ్చారు. రక్షణ శాఖకు చెందిన ఆయుధాల కొనుగోలు తదితర అంశాలలో కుంభకోణాల ఆరోపణలకు భయపడి కూర్చుంటే లాభం లేదని తాను దేనికీ భయపడకుండా నిర్ణయాలు తీసుకుంటానని మనోహర్‌ పారికర్‌ అప్పటిలో ప్రకటించారు. ప్రకటనకు అనుగుణంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తదితర వస్తువుల కొనుగోలుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ముందుగా ఆయన చర్యలు తీసుకున్నారు.

1986 లో బోఫోర్‌‌స కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి ఆ సాంకేతికతను వినియోగించి రూపోందించాల్సిన శతృఘ్ని తుపాలను గత మూడు దశాబ్దాలుగా వాయిదా వేసిన రక్షణ శాఖకు ఎట్టకేలకు నిజాయితీ నేతగా పేరొందిన ఏకే అంటోని రక్షణశాఖ బాద్యతలను నిర్వహించిన సమయంలో 155 ఎంఎం హౌటిజర్స్ తయారుకు దేశీయంగా చర్యలు తీసుకోవాలని భారత్ రక్షణ పరిశోధక శాఖలను అదేశించడంతో 2012 నుంచి వీటి రూపకల్పనకు ఢిపెన్స్ ఫ్యాక్టరీలు అధ్యయనం చేశారు.

బోఫోర్స్ తొలి డీల్ లో లభించిన సాంకేతిక పరిజ్ఞానానికి దేశీయ పరిజ్ఞానాన్ని జోడించి మరింత అదునాతనంగా శతృఘ్ని తుపాకులను రూపోందించాలని అంటోని అదేశాల మేరకు భారత అర్డినెన్స్ పరిశోధనా విభాదాలు బోఫోర్స్ కన్నా అధునాతనం, శక్తివంతమైన శతృఘ్ని తుపాలను తయారు చేసి వాటికి ధనుష్ లుగా నామకరణం చేశారు. కొత్తగా ఒక్క 155 ఎంఎం శతఘ్ని తుపాకీలు రూపోందించి.. భారత సైన్యానికి అందించింది. ఈ మేరకు అర్డినెన్స్ ఫ్యాక్టరీ గన్ క్యార్యేజ్ ఫ్యాక్టరీ జాయింట్ జనరల్ మేనేజర్, పీఆర్వో సంజయ్ శ్రీవాత్సవ తెలిపారు.

భారత్ ఆర్మీకి మరో మూడు ధనుష్ శతృఘ్ని తుపాకులను కూడా త్వరలోనే అందజేస్తామని చెప్పారు. ఇది 155ఎంఎం/ 45 కాలిబర్‌ హోవిట్జర్‌ శతఘ్ని తుపాకి. అత్యంత శక్తిమంతమైన అధునాతనమైన ఈ శతఘ్ని తుపాకి 83 శాతం భారతీయ విడిభాగాలతో తయారు చేసిన ఘనత మన ఆర్డినెన్‌‌స ఫ్యాక్టరీ సొంతం చేసుకున్నది. కొల్ కత్తాలోని అర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో రూపాందించిన ఈ తుపాలకు మొత్తంగా 114 కావాలని భారత అర్మీ అర్డర్ చేసిందని, వాటితో తొలి విడతగా మూడు తుపాకులను అందించామని మరో మూడింటిని త్వరలోనే అంతజేస్తామని శ్రీవాత్సవ తెలిపారు.

ఒక్కోటి దాదాపు 14 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఈ ధనుష్‌ శతఘ్ని తుపాకీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేటితరం అత్యాధునిక ఆయుధ వ్యవస్థలతో పోటీ పడేదిగా ఉంది. ఎలక్ట్రానిక్‌ విధానంలో తుపాకీని అమర్చడం, శత్రు వ్యవస్థలను గుర్తించే పరికరాలతో పాటు ఇతర పలు అత్యాధునిక వ్యవస్థలుండే, దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ తుపాకీ బోఫోర్‌‌స నుంచి 30 ఏళ్ల కిందట దిగుమతి చేసుకున్న హోవిట్జర్‌ తుపాకీ కన్నా అదనంగా 11 కిలోమీటర్ల దూరం రేంజిని కలిగి ఉంటుంది. భారత సైన్యం వీటిని ఇప్పటికే వేసవి కాలపు పరీక్షలు, వర్షాకాలపు, శీతకాలపు పరీక్షలు నిర్వహించగా, వాటిని ధనుష్‌ విజయవంతంగా పూర్తి చేసుకున్నది. ఈ పరీక్షలలో సుమారు 2000 రౌండ్లను భారత అర్మీ పరీక్షించింది. మంచు, ఏడారి, సాధారణ పరిస్థుల ప్రభావం అధికంగా వుండే ప్రాంతాలలో ఈ పరీక్షలను నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Ordnance factory board  Dhanush  Artillery gun  Bofors  Indian Army  

Other Articles