'RSS killed Gandhi': Express regret or face trial, Supreme Court tells Rahul Gandhi

Express regret or face trial supreme court tells rahul gandhi

supreme court, rahul gandhi, Rashtriya Swayamsevak Sangh, Mohan das karamchand gandhi, mahatma gandhi assasination, defamation trail, historical facts, part of the government records, Justice Dipak Misra, Justice R F Nariman, supreme court bench, kapil sibal, RSS killed Gandhiji,

The Supreme Court asked Congress vice-president Rahul Gandhi to express regret for his comments holding the RSS responsible for Mahatma Gandhi's assassination or be ready to face a defamation trial.

క్షమాపణా? విచారణా? రాహుల్ ను తేల్చుకోమ్మన్న సుప్రీంకోర్టు

Posted: 07/19/2016 01:31 PM IST
Express regret or face trial supreme court tells rahul gandhi

కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీకి సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై ఆయన చేసిన అరోపణల నేపథ్యంలో వారికి బేషరుతుగా క్షమాపణలు చెబుతావా.? లేక కోర్టు విచారణను ఎదుర్కోంటావా..? ఏదో ఒకటి తేల్చిచెప్పాలని అత్యున్నత న్యాయస్థానం రాహుల్ గాంధీకి సూటిగా ప్రశ్నించింది. ఒక సంస్థలోని అందరి వ్యక్తులను అపాదించేలా వ్యాక్యలు చేయడం సబబు కాదని, ఇంత పెద్ద దోషాన్ని ఒక సంస్థపై ఎలా మోపుతావని సుప్రీంకోర్టు ధర్మాసానం ప్రశ్నించింది.

2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భివాండీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ అర్ఎస్ఎస్ వాదులే అప్పట్లో మహాత్మగాందీని చంపారు.. ఇప్పుడు వారే గాంధీ, సర్ధార్ వల్లభభాయ్ పటేల్ లను కీర్తిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ వాదులు కోర్టులో క్రిమినల్ కేస్ దాఖలు చేశారు. అయితే తనపై అర్ఎస్ఎస్ దాఖలు చేసిన క్రిమినల్ కేసును కోట్టివేయాలని రాహుల్ గాంధీ అత్యున్నత న్యాయస్థానాన్ని అశ్రయించడంతో.. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ అయనను క్షమాపణలు చెబుతారా..? లేక విచారణను ఎదుర్కోంటరా..? తేల్చిచెప్పండీ అంటూ అదేశించింది.

రాహుల్ గాంధీ తరపు న్యాయవాది ఇవి చరిత్రక సత్యాలని, ప్రభుత్వ రికార్డులోనూ ఇవి ఉన్నాయని చెప్పబోయారు. ఆ తరువాత ఈ కేసును కనీసం రెండు వారాల పాటు వాయిదా వేయాలని రాహుల్ కోరారు. తన తరపు న్యాయవాది కపిల్ సిబాల్ అప్పటి వరకు అందుబాటులో వుండని కారణం చేత రెండు వారాలు గడవు ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే అప్పటి వరకు కేసును వాయిదా వేయడం కుదరదని చెప్పిన సర్వోన్నత ధర్మాసనం.. ఈ నెల 27కు కేసును వాయిదా వేసింది. దీంతో రాహుల్ గాంధీ న్యాయస్థానంలో విచారణను ఎదుర్కోంటరా..? లేక క్షమాఫణలు చెబుతారా..? అన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles