ఒకప్పుడు రిచ్.. ఇప్పుడు బీచ్ రోడ్లపై సమోసాలతో గడుపుతున్నాడు | Once bollywood child artist now Can't Afford Food

Once bollywood child artist now can t afford food

bollywood child at mumbai beach, child artist now Can't Afford Food, Humans of Bombay bollywood child artist story

Once bollywood child artist now Can't Afford Food in Mumbai beach roads.

ఒకప్పుడు రిచ్.. ఇప్పుడు బీచ్ రోడ్లపై సమోసాలతో గడుపుతున్నాడు

Posted: 07/19/2016 12:40 PM IST
Once bollywood child artist now can t afford food

కడు పేదరికంలో కష్టాల నావను ఈది విజయ తీరాలు చేరిన వ్యక్తుల జీవిత గాథలను చదవటం, వాటిని ఆదర్శంగా తీసుకోవాలంటూ పెద్దలు చెబుతుండటం కామనే. కానీ, ఇక్కడో వ్యక్తి కథ పూర్తిగా విరుద్ధం. ఓడలు బండ్లు అవుతాయి అనటానికి ప్రత్యక్ష ఊదాహరణ. ఒకప్పుడు కోటీశ్వరుడిగా బాగా బతికిన ఇతగాడు, ఆపై చితికి వీధిన పడి అడుక్కు తింటున్నాడు. పైగా ఆయన మాములు వ్యక్తి ఏం కాదు... ఒకప్పుడు పెద్ద పెద్ద స్టార్ల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వ్యక్తి.

"అప్పట్లో నేను ధనవంతుడినే. ఓ పెద్ద ఇంట్లో ఉండేవాళ్లం. ప్రముఖులు, కోటీశ్వరులతో మాత్రమే పార్టీలు జరుగుతుండేవి. రోజుకు 10 సార్లు తిండి తినే స్తోమత ఉండేది మాకు. కానీ, నేడు నాకోసం ఒక్క పూట భోజనానికీ గతి లేకుండా పోయింది. నేను చైల్డ్ ఆర్టిస్టుగా పనిచేసే సమయంలో ఎన్నో చిత్రాల్లో ప్రముఖ నటీనటులతో నటించాను. నా తల్లిదండ్రుల మరణంతో కష్టాలు మొదలయ్యాయి. అవకాశాలు తగ్గాయి. అని ఆయన చెబుతున్నాడు. జేబులో డబ్బులు లేకుంటే, ఎంత టాలెంట్ ఉన్నా దానికి గుర్తింపు లభించదు. కొన్నిసార్లు ముఖాన్ని కూడా మరచిపోతారు" అని ఆవేదన చెందుతున్నాడు.

ఒకప్పటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ దీనగాథను రెండు రోజులక్రితం హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్ బుక్ పేజీలో ప్రచురించింది. అయితే ఆయన ఫోటోను పెట్టినప్పటికీ పేరును మాత్రం వెల్లడించలేదు. ముంబై బీచ్ రోడ్లపై సమోసా, చపాతీని భోజనంగా తింటూ గడుపుతున్న ఇతను, భవిష్యత్తుపై మాత్రం తనకింకా ఆశలు చావలేదని, ఏనాటికైనా పాత పొజిషన్ కు వస్తానని నమ్మకంగా చెబుతున్నారు. ఆ రోజు రావాలని మనమూ ఆశిద్దాం. ప్రస్తుతం నెట్ లో ఈ కథ వైరల్ అవుతోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Humans of Bombay  bollywood  child artist  rich  beach roads  Can't Afford Food  

Other Articles