Income Tax raids raids at 70 premises of Indiabulls

Indiabulls offices raided for rs 1500 cr tax evasion

indiabulls, income tax, indiabulls tax evasion, tax evasion, income tax indiabulls, suziki scooters, suziki access, shila dixit, donald trump, indiabulls tax raids, tax raids indiabulls, national news, latest news, companies news, business news

The Income tax department raided over 20 premises of real estate giant Indiabulls to probe tax evasion to the tune of Rs 1500 crore by the group.

ఇండియా బుల్స్ పై ఐటీ దాడులు అందుకోసమేనా..?

Posted: 07/14/2016 06:13 PM IST
Indiabulls offices raided for rs 1500 cr tax evasion

పన్ను ఎగవేత అభియోగాలతో ఇండియా బుల్స్ కు చెందిన కంపెనీల కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు జరిపింది. క్రితం రోజున ప్రారంభమైన దాడులు ఇవాళ కూడా కోనసాగాయి. ఉన్నట్టండి సునామి వచ్చినట్లుగా ఇండియ బుల్స్ కంపెనీపై భారీ స్థాయిలో దాడులు జరగడం ఎందుకన్న అనుమానాలు కూడా కార్పోరేట్ ప్రపంచంలో చక్కర్లు కోడుతున్నాయి. అయితే వివిధ లావాదేవీలకు సంబంధించి దాదాపు రూ.1,500 కోట్ల పన్ను ఎగవేత జరిగిందన్న పక్కా సమాచారంతోనే అదాయపన్ను శాఖ దేశవ్యాప్తంగా ఈ సంస్థ కార్యాలయాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించిందన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. పోలీసు రక్షణతో దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది ఐటి శాఖ ఉద్యోగులు ఈ సోదాల్లో పాల్గొన్నారు

గ్రూపు కంపెనీల విభజన తర్వాత ప్రమోటర్లకు ఆస్తులు బదిలీ చేసే క్రమంలో పన్నులు ఎగవేసేందుకు అనేక అవకతవకలకు పాల్పడినట్టు ఐటి శాఖ అనుమానించి దాడులు నిర్వహించింది. దీనికి తోడు గ్రూపు కంపెనీలు ఇటీవల సేకరించిన రూ.1,700 కోట్ల రుణాలపైనే ఐటి అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. గతంలో కంపెనీ ఆస్తులు అమ్మినపుడు దాదాపు రూ.1,000 కోట్ల విలువైన బినామీ లావాదేవీలు జరిగినట్టు ఐటి అధికారులు అనుమానిస్తున్నా రు. కంపెనీకి చెందిన ఢిల్లీ, ముంబై, చెన్నై ఆఫీసుల నుంచి అనేక కీలక డాక్యుమెంట్లతో పాటు కొన్ని కంప్యూటర్‌ హార్డ్‌ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

కాగా ఇటీవలి కాలంలో ఒక కార్పోరేట్ సంస్థకు చెందిన కార్యాలయాలపై ఇంత పెద్ద ఎత్తున సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగా ఉన్న తమ ఆఫీసుల్లో ఐటి శాఖ సోదాలు చేయడం నిజమేనని ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ బిఎ్‌సఇకి తెలియజేసింది. ఈ దాడుల్లో అదాయపన్ను శాఖ అధికారులకు తమ సంస్థ సభ్యులు అన్ని వివరాలను అందించి సహకరించారని సంస్థ తెలిపింది. కాగా అదాయపన్ను శాఖ దాడుల నేపథ్యంలో ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ లిమిటెడ్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌, ఇండియాబుల్స్‌ హోల్‌సేల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ కంపెనీల షేర్లు నష్టపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indiabulls  income tax  tax evasion  Indian markets  raids  share fall  

Other Articles